భారీ హిట్ లు కొడుతూ పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరోగా ఉన్నా… రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో ఏదో తెలియని బాధ. సినిమాలు కాదన్నా పెళ్లి చేసుకుని మాకు ఓ వారసుడ్ని ఇవ్వు అన్నా అంటూ ఫ్యాన్స్ రిక్వస్ట్ చేస్తున్నారు. దాదాపు పదేళ్ళ నుంచి ప్రభాస్ పెళ్లిపై ఏదోక న్యూస్ వస్తుంది గాని పెళ్లి మాత్రం జరగడం లేదు. అసలు చేసుకుంటాడా లేక సల్మాన్ ఖాన్ మాదిరి ఒంటరిగా మిగిలిపోతాడా అర్ధం కాని పరిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు… ఎన్నో గాసిప్స్… కాని పక్కా న్యూస్ లేదు.
ఇక తాజాగా ప్రభాస్ ఈ కార్యక్రమంలో దీనిపై సంచలన కామెంట్స్ చేసాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా ఉన్న రెబల్ స్టార్… ఎప్పుడు భర్త అనే ట్యాగ్ తగిలించుకుంటాడు అనే దాని కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో… తనకు పెళ్లిపై అసలు క్లారిటీ లేదు అన్నట్టు ప్రభాస్ మాట్లాడటం చూసి జనాలు షాక్ అవుతున్నారు. 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి విషయంలో ప్రభాస్ ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నట్లుగా లేటెస్ట్ కామెంట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. చేసుకోకూడదా? అనే కామెంట్ ప్రభాస్ నుంచి వచ్చింది.
ఈటీవీలో ప్రసారమవుతోన్న సిరివెన్నెల ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా… సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావనలో ప్రభాస్ ఓ కామెంట్ చేసాడు. మనీ అనే సినిమా కోసం సిరివెన్నెల ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచ్‌లర్’ అనే పాట రాయగా… దానిపై ప్రభాస్ రియాక్ట్ అవుతూ… అంటే ఈ పాటలో శాస్త్రిగారు పెళ్లి చేసుకోవద్దని చెప్పారని… ఆ తర్వాత చాలా సినిమాలలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు.
ఆయన పాటలు విన్న తర్వాత కన్ఫ్యూజన్‌లో పడిపోయా అంటూ… ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా? అని కామెంట్ చేసాడు. అది సరదా కామెంట్ అయినా ఫ్యాన్స్ లో మాత్రం ఏదో తెలియని భయం. ఈ వయసు వచ్చినా ఆ సరదా కామెంట్ ఏంటి అన్నా… పెళ్లి చేసుకో ఫాస్ట్ గా అంటూ సరదాగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో… జల్సా… సినిమాలో ‘చలోరే చలోరే చల్’ అనే పాట తనకు ఎంత ఇష్టమో, ఆ పాటతో తన ఫ్రెండ్స్ ను ప్రభాస్ ఏ విధంగా… ఎంతగా ఇబ్బంది పెట్టేవాడో కూడా ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ మూడేళ్లలో రిలీజ్ కానున్నాయి.