Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి నవదీప్.. బేబి సినిమాపై సీపీ ఆగ్రహం..!

నవదీప్ స్నేహితుడు రాంచంద్ ఇచ్చిన సమాచారం ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందని సీవీ ఆనంద్ చెప్పారు. తాజాగా మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ విభాగం పట్టుకుంది. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - September 14, 2023 / 07:17 PM IST

Navdeep: టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకుంది. హీరో నవదీప్‌కు తాజా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్ ఇచ్చిన సమాచారం ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందని సీవీ ఆనంద్ చెప్పారు. తాజాగా మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ విభాగం పట్టుకుంది. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో నవదీప్‌పై కీలక ఆరోపణలు చేశారు. “టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో ఉన్నవారి పేర్లు బయటకు వస్తున్నాయి. మదాపూర్‌లో నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేశాము. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్స్ సీజ్ చేశాము. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ ముఠాలో ఉన్న నైజీరియన్లు వీసా గడవు ముగిసినప్పటికీ మన దేశంలోనే ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వరంగల్ చెందిన వ్యక్తి ఉన్నారని గుర్తించాము. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేష్ రావును అరెస్టు చేశాం. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చిందని తెలిసింది. బెంగుళూరులో 18 మంది నైజీరియాలు ఉన్నారని గుర్తించాం.
పరారీలో నవదీప్.. బేబి సినిమాపై ఆగ్రహం..
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కూడా ఉన్నాడు. అతడి స్నేహితుడు రాంచంద్‌ను అరెస్ట్ చేసి విచారించగా.. నవదీప్ కూడా ఒక కస్టమర్‌గా తేలింది. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నాడు. అతడు డ్రగ్స్ తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన బేబీ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలో చూపించారు. సినిమా చూసే డ్రగ్స్ కేసు నిందితులు ఈ విధంగా పార్టీ చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌పై మేం రైడ్ చేసినప్పుడు అక్కడి పరిస్థితి బేబి సినిమాలోలాగా ఉంది. సినిమాలో డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలకు కనీసం హెచ్చరిక కూడా వేయలేదు. ఈ విషయంపై మేం హెచ్చరికలు చేసిన తర్వాతే సినిమాలో కాషన్ నోట్ వేశారు. దీనిపై బేబి సినిమా దర్శక, నిర్మాతలకు నోటీసులు ఇస్తాం. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదు. ఇలాంటి దృశ్యాలను చేయొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బేబీ ఇప్పటి నుంచి ప్రతి సినిమా పై పోలీసుల నిఘా ఉంటుంది” అని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్ గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో విచారణకు కూడా హాజరయ్యాడు.