TOLLYWOOD: టాలీవుడ్ బిగ్ మూవీస్.. ఎన్నికల తర్వాతే అసలు పోటీ..

మొద‌టి మూడు నెల‌లు ఇలా గ‌డిచిపోగా.. మిగిలిన మూడు నెల‌లు.. ఐపీఎల్, ఎన్నికల సందడితో ముగిసిపోనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం స్టార్ట్ కానుంది. దీంతో సెకండాఫ్‌లోనే టాలీవుడ్‌కు చెందిన అనేక భారీ ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 05:11 PM IST

TOLLYWOOD: టాలీవుడ్ సినిమాల ప‌రిస్థితి ఈసారి కాస్త అయోమ‌యంగా ఉంది. సాధారణంగా ప్రతీ ఏటా తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీ రివ్యూ ఉంటుంది. కానీ.. ఈసారి అలాంటి పరిస్థితులు క‌నిపించ‌డం లేదు. 2024.. మరో పది రోజుల్లో మూడు నెలలు పూర్తి చేసుకుంటున్న‌ప్ప‌టికీ టాలీవుడ్ సీన్ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. సంక్రాంతి త‌ర్వాత పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. అయితే.. హ‌నుమాన్ లాంటి చిన్న సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ప్ప‌టికీ.. పెద్ద సినిమాలు లేని ఎఫెక్ట్ మాత్రం బాగానే క‌నిపిస్తోంది.

Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

మొద‌టి మూడు నెల‌లు ఇలా గ‌డిచిపోగా.. మిగిలిన మూడు నెల‌లు.. ఐపీఎల్, ఎన్నికల సందడితో ముగిసిపోనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం స్టార్ట్ కానుంది. దీంతో సెకండాఫ్‌లోనే టాలీవుడ్‌కు చెందిన అనేక భారీ ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి. ఈ లెక్క‌న టాలీవుడ్‌లో సెకండాఫ్‌పైనే భారం అంతా పడనుంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు పుష్ప 2, దేవర, ఓజి, గేమ్‌ఛేంజర్ ఇలా చాలా సినిమాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు డేట్స్ ఫిక్స్ చేసుకోగా.. త్వరలోనే మరిన్ని ఖరారు చేసుకోనున్నాయి. సెకండాఫ్‌లో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బోణీ చేయనుంది. ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక‌.. ప్రభాస్ కల్కి పోస్టుపోన్ అయితే ఇదే రోజు ఫ్రెండ్స్ ఇద్దరు పోటీ పడేలా కనిపిస్తున్నారు. నెల రోజుల గ్యాప్‌లో సెప్టెంబర్ 27న ఓజితో పవన్ కళ్యాణ్ రానున్నారు. అత్తారింటికి దారేది విడుదలైన 11 ఏళ్ళ తర్వాత అదే తేదీన మళ్లీ రానున్నారు పవర్ స్టార్.

ఈ మూవీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. ఇక‌.. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దేవర 1 అక్టోబర్ 10న, దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీనిపై అంచనాలు స్కైహైగా ఉన్నాయి. అయితే.. అక్టోబ‌ర్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్టార్ వార్ త‌ప్ప‌ద‌న్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. తండేల్ సినిమా కూడా అక్టోబర్‌లోనే విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. దసరా రేసులో తారక్, చైతూతో పాటు బాలయ్య కూడా ఉంటాడ‌ని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా దసరాకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జ‌రిగితే ద‌స‌రా ఫైట్ చాలా టైట్‌గా ఉండ‌డం ఖాయ‌మంటున్నారు. ఇక‌.. లాస్ట్.. బ‌ట్ నాట్ లీస్ట్ అంటూ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు గ్లోబ‌ల్ స్టార్ రాం చ‌ర‌ణ్. డిసెంబర్ 25న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ రూపంలో క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్. భారీ చిత్రాల డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా వైడ్‌గా హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సెకండాఫ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాల‌న్నింటి ఫ‌లితాల‌పైనే టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ అయిందంటున్నారు. మ‌రి.. ఈ సినిమాలు ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాల్సిందే.