టాలీవుడ్ బ్లాక్ టికెట్ దందా, దావూద్, చోటా రాజన్ అమ్మ మొగుళ్ళు మన ప్రొడ్యూసర్స్

చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం గురించి మీకు ఐడియా ఉందా...? వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అనే ఐడియా ఉంటుంది గాని... వీళ్ళు అసలు డాన్ కావడానికి ముందు చేసిన చిల్లర వ్యాపారాలు ఏంటో తెలుసా...? బ్లాక్ టికెట్ లు అమ్మడం.

  • Written By:
  • Publish Date - December 19, 2024 / 05:15 PM IST

చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం గురించి మీకు ఐడియా ఉందా…? వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అనే ఐడియా ఉంటుంది గాని… వీళ్ళు అసలు డాన్ కావడానికి ముందు చేసిన చిల్లర వ్యాపారాలు ఏంటో తెలుసా…? బ్లాక్ టికెట్ లు అమ్మడం. ముంబైలో ఫేమస్ ఏరియాల్లో ఈ ఇద్దరూ బ్లాక్ టికెట్ లు అమ్మేవారు. అలా వచ్చిన సొమ్ముతో సొంతగా గ్యాంగ్ లు ఏర్పాటు చేసి… తర్వాత అండర్ వరల్డ్ ను శాసించే స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ హవా తగ్గింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో అదే చేసాడు.

ఇప్పుడు ఆ ప్లేస్ లో సినిమా వాళ్ళే ఎంటర్ అయ్యారు. బ్లాక్ టికెట్స్ అమ్ముకుని దావూద్, చోటా రాజన్, లారెన్స్ బిష్ణోయ్ లు డాన్స్ అయ్యారు. మనం ఎందుకు కాకూడదు అనుకున్నారో ఏమో… డాన్ ల కంటే హీనంగా టికెట్ లు బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు. అప్పుడు సర్కార్ అనుమతి లేక అది బ్లాక్ టికెట్ అయింది. ఇప్పుడు చేసే దోపిడికి గవర్నమెంట్ ల సపోర్ట్ కూడా ఉంది. అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమా వాళ్ళు స్పెషల్ షోస్ పేరుతో వసూలు చేయడం మొదలుపెట్టారు.

ప్రీమియర్ షో, బెనిఫిట్ షో అంటూ తొక్కలో షోస్ అన్నీ ఇప్పుడు పుట్టుకు వచ్చాయి. హీరోలకు వందల కోట్లు ఇవ్వడం, ఫ్యాన్స్ పిచ్చితనం నుంచి అండర్ వరల్డ్ డాన్స్ రేంజ్ లో దోపిడీలు చేయడం. కాకపోతే జీవోలు వీళ్ళకు అడ్డం ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏకంగా సినిమా వాళ్ళు ప్రభుత్వాలనే “బ్రోకర్లు”గా మార్చి దందాకు దిగుతున్నారు. స్మార్ట్ గా ప్రభుత్వాలనే “బ్లాక్ టిక్కెట్లు” అమ్మిపెట్టే “వైట్ కాలర్” ఎజెంట్ గా రంగంలోకి దించి దోచుకోవడం స్టార్ట్ చేసారు. టీజర్లు, ప్రీ రిలీజ్ పేరుతో హైప్ క్రియేట్ చేయడం దోచుకోవడం నయా ట్రెండ్.

ఏదో ఫోటో రిలీజ్ చేయడం, హైప్ వచ్చింది అంటూ మీడియాలో వార్తలు రాయడం, సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ చేయడం… కామన్ గా మారిపోయింది. రెండు మూడేళ్ళ పాటు సినిమా షూటింగ్ చేయడం, వందల కోట్ల బడ్జెట్ పెట్టాం అంటూ కథలు చెప్పడం, అది వసూలు చేసుకోవడానికి వందలు వందలు టికెట్ ధరలు పెంచేసి అభిమానుల రక్తం తాగడం కామన్ అయిపోయింది. మా సినిమాకు వెయ్యి కోట్లు వచ్చాయి… 2000 కోట్లు వచ్చాయని పోస్టర్లు రిలీజ్ చేస్తూ… మీ రక్తం, మీ చెమటతో మేము దోచుకున్నామని సిగ్గులేకుండా చెప్పేస్తున్నారు సినిమా వాళ్ళు.

బ్లాక్ టికెట్ లు అమ్ముకునే వాళ్లకు సమాజంలో విలువ ఉండేది కాదు. తక్కువగా, హీనంగా, నీచంగా మాట్లాడేవారు. కాని ఇప్పుడు మాత్రం హీరో, స్టార్ ప్రొడ్యూసర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పిచ్చితో బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు. కొన్నేళ్ల కిందటి వరకు 10 రూపాయల ధర ఉన్న టికెట్ ధరను 15 చేసి అమ్మితే పెద్ద గొడవ అయ్యేది. కొందరిపై పీడీ యాక్ట్ లు కూడా పెట్టారు. అలాంటిది 100 రూపాయల టిక్కెట్టుని ఇప్పుడు వెయ్యి చేసి అమ్మేస్తున్నారు. బాహుబలి, సాహో, కేజిఎఫ్ 2, కల్కి, గుంటూరు కారం, ఆర్.ఆర్.ఆర్., అధిపురుష్, దేవర, ఆచార్య, సలార్, పుష్ప 2 సినిమాలకు ఇలాగే దోచేశారు.

మల్టీ ప్లెక్స్ లలో 150 రూపాయల టిక్కెట్ ధర మొదటి వారం, పది రోజుల వరకు 1000, 800, 400, 300 రూపాయలుగా మారుతోంది. సినిమాకు క్రేజ్ ఉందని, సూపర్ హిట్ అని… చెప్తూ వేల కోట్లు సామాన్యుల నుంచి వసూలు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి పది రోజుల్లోనే లాగేస్తున్నారు నిర్మాతలు. లాభాలో వందల కొట్లలో సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రులను కలవడం, టికెట్ ధరలు పెంచడం, బెనిఫిట్ షో ముసుగుతో బ్లాక్ టికెట్ లు అమ్మడం చేస్తున్నారు. ప్రీమియర్ షోస్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళ పిల్లలతో హోం థియేటర్ లో సినిమాలు చూస్తూ కూలికి వెళ్లి ఒళ్ళు గుల్ల చేసుకునే ప్రేక్షకుడి పిల్లలను మాత్రం వసూళ్ళ కోసం తొక్కి చంపుతున్నారు.