Tollywood: ముద్దు సీన్ల గురించి కాస్త ముద్దు ముద్దుగా ..

పెదవికి పెదవే రాసె ప్రేమలేఖ ముద్దు అంటూ మన యూత్ స్టార్స్ అంతా సీరియల్ ముద్దులు పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో బాయ ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ హాట్ లిప్ లాక్స్ పెట్టిసి హాట్ వేవ్స్ క్రియేట్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా .

  • Written By:
  • Updated On - July 28, 2023 / 05:26 PM IST

Tollywood: ముద్దంటే చేదా … నీకా ఉద్దేశం లేదా ? పాత సినిమాలో ఈ పాటకు అప్పట్లో చేదే అని సమాధానం వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ..పెదవికి పెదవే రాసె ప్రేమలేఖ ముద్దు అంటూ మన యూత్ స్టార్స్ అంతా సీరియల్ ముద్దులు పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో బాయ ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ హాట్ లిప్ లాక్స్ పెట్టిసి హాట్ వేవ్స్ క్రియేట్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా . అలాగే రౌడీ బాయ్స్ చిత్రంలో హీరో ఆశిష్‌కి లీప్‌లాక్ ఇచ్చేసి వారేవా అనిపించింది క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అంతకుముందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 ముద్దులు పెట్టేసి 24 కిస్సెస్ అనే సినిమా చేసింది హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఇక రొమాంటిక్ గల్లీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమాలో హీరోయిన్ నేహశెట్టికి వరుస ముద్దులు పెట్టేసి.. అట్లుంటది మనతోని అని హైదరాబాదీ స్టైల్‌లో స్టైల్ కొట్టాడు. రొమాంటిక్ లవ్ స్టోరీలలో ఓ రేంజ్‌లో ఉండే సినిమా రాధే శ్యామ్. ఆ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే లిప్స్ తన లిప్స్‌తో లాక్ చేసాడు డార్లింగ్ ప్రభాస్.
ఆ మధ్య ఉర్వశివో రాక్షసివో సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ మధ్య లిప్ లాక్స్ ఆ సినిమా సక్సెస్‌కి అసలు కారణంగా నిలిచాయి. ఈ ముద్దులాటలో అడివి శేష్ రూటే సెపరేటు. అయన మేజర్ సినిమాలో సయీ మంజ్రేకర్‌తో, హిట్ 2 సినిమాలో మీనాక్షి చౌదరితో లిప్ లాక్స్ చేసి వావ్ అనిపించాడు. ఈ లిప్ లాక్ ఆటలో మాస్ రాజా రవితేజ సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. అయన రకుల్ ప్రీత్ సింగ్‌తో కిక్ సినిమాలో, పవర్‌లో రెజీనాతో , టచ్ చేసి చూడు సినిమాలో రాశి ఖన్నాతో . ఖిలాడిలో మీనాక్షి చౌదరితో , ఇంకా రావణాసుర సినిమాలో ఒకరిద్దరు హీరోయిన్లకు సైలెంట్ గా కిస్‌లు పెట్టేసి చంటిగాడు లోకల్ అని కాలర్ ఎగరేసాడు. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి , గీత గోవిందం, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లాంటి సినిమాల్లో హాట్ హాట్ కిస్‌లతో తన రౌడీ ఇజాన్ని ప్రదర్శించాడు. కింగ్ నాగార్జున గీతాంజలి సినిమాలో లిప్ లాక్ సీన్ కి ఓం నమః అనే పాట పాడేసుకున్నాడు. అయన ట్రాక్‌లోనే వెళ్లి సమంతకి లిప్ లాక్ ఇచ్చి ఏ మాయ చేసావే అని ఆమెనే అడిగేశాడు నాగ్ తనయుడు నాగచైతన్య. ఇప్పుడు ఓటిటి సినిమాలలో లిప్ లాక్ అనేది ఒక రెగ్యులర్ స్కీం గా మారిపోయింది. లేడీ ఆర్టిస్ట్స్ కూడా యాక్టింగ్‌కి ఒక పేమెంట్ , లిప్ లాక్స్ ఉంటె మరో పేమెంట్ అంటూ డబ్బు వసూలు చేస్తూ హ్యాపీ హ్యాపీ గా ఉన్నారు.