DIRECTORS: టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. దానికి తగ్గట్లే దర్శకుల మైండ్‌సెట్ చేంజ్ అయింది. మొన్నటి వరకు క్లాస్ మూవీస్‌కే పరిమితమైన మేకర్స్.. ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నారు. పాత ఫార్ములాకి ఫుల్‌స్టాప్ పెట్టి.. మాస్ కంటెంట్‌తో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల సినిమాలు అంటే.. హాయిగా కాఫీ తాగినట్లు ఉంటాయ్. ఎక్కడా హింస, రక్తపాతం ఉండవు. అలాంటి అంశాలున్న కంటెంట్‌ని తను తీసుకోడు. గోదావరి నుంచి మొన్నొచ్చిన లవ్‌స్టోరీ వరకు ప్రతి ప్రాజెక్ట్‌లో ఇదే ప్లేవర్ కనిపిస్తుంది.
PRABHAS: ప్రభాస్‌కు సలార్ సినిమా నచ్చలేదా..? ప్రమోషన్‌కు రావడం లేదెందుకు..?
కానీ ధనుష్ ప్రాజెక్ట్ కోసం తన ఫార్ములానే మార్చేశాడు శేఖర్ కమ్ముల. ముంబై బ్యాక్ డ్రాప్‌లో సాగే మాఫియా స్టోరీగా ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాడు. హీరోతో బాంబులు, కత్తులు, కటార్లు పట్టించడానికి రెడీ అవుతున్నాడు. ఎప్పుడు కూల్‌గా ఉండే కమ్ముల నుంచి ఇలాంటి కంటెంట్‌ని ఎవరు ఊహించలేదు. కొరటాల శివ అంటే సెన్సిబుల్ స్టోరీలకు కేరాఫ్. కథకు తగ్గట్టు తన మార్క్ యాక్షన్ జోడించడం తన స్టైల్. మిర్చి నుంచి ఆచార్య వరకు ప్రతీ ప్రాజెక్ట్ ఇలా తెరకెక్కినవే. అయితే దేవరతో తను కూడా రూటు మార్చాడు. ఓ కొత్త జోనర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బయటపెట్టే లైన్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ని నెక్స్ట్ లెవల్‌లో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్పతో స్టైలిష్ మేకర్ సుకుమార్ కూడా తన పంథా మార్చేసాడు. ఓ కొత్త బ్యాక్‌డ్రాప్, స్టోరీని ఎంచుకుని చేసిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియాలో తనకు మంచి పేరు తెచ్చింది. నేషనల్ అవార్డ్‌తో ప్రత్యేక గుర్తింపు దక్కింది. అందుకే పుష్ప2ని మరింత వయలెంట్‌గా రెడీ చేస్తున్నాడు.
ప్రజెంట్ సెట్స్‌పై ఉన్న ఈ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది. పటాస్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి కూడా.. మొన్నటివరకు కామెడీ జానర్‌తో గారడీ చేశాడు. ఎఫ్2, ఎఫ్3, రాజా ది గ్రేట్ అంటూ కితకితలు పెట్టాడు. సరిలేరు నీకెవ్వరుతో ట్రాక్ మార్చిన తను.. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాలయ్యను ఫుల్ మాస్ మూడ్‌లో చూపించి.. బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. కథలో కొంత కామెడీ ఉన్నా.. కంటెంట్‌పరంగా భారీ మార్పు చూపించాడు. మొత్తానికి మొన్నటి వరకు క్లాస్ ప్రాజెక్ట్స్‌కే పరిమితమైన ఈ డైరెక్టర్స్ అంతా.. ఇప్పుడు ప్లాన్ మార్చారు. మాస్ కథలతో మోతెక్కించేందుకు సై అంటున్నారు.