అందుకోసమే మన డైరెక్టర్లు పనికట్టుకుని తెలుగు హీరోలు వద్దు, తమిళ స్టార్లే ముద్దంటున్నారా? అదేంటో అడిగిందే తడువు మన దర్శకులు అడిగితే డేట్ల ని చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నారు విజయ్, సూర్య, ధనుష్ అండ్ కో.. చిన్నదర్శకుడా? పెద్ద డైరెక్టరా అని చూడట్లేదు.
కొత్తగా అజిత్ కూడా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కథకి సై అన్నాడట. మొన్న విజయ్ తో వంశీ పైడి పళ్లి వారసుడు తీశాడు. ఇప్పుడు మరోసారి సేమ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ధనుష్ తో సార్ మూవీ తీసిన వెంకీ అట్లూరి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో సినిమా తీయబోతున్నాడు. ఇక ధనుష్ తో ఎప్పుడో శేఖర్ కమ్ముల మూవీ ప్లాన్ జరిగిపోయింది.
సూర్య తో బోయపాటి సినిమా మిస్ అయినా, చందూ మొండేటి కథ ఓకే అయ్యేలా ఉంది.. ఇక ఎలాగూ దిల్ రాజు బ్యానర్లో రజినీకాంత్ సినిమా అంటే టాలీవుడ్ డైరెక్టరే తెరకెక్కిస్తాడని తేలిపోయింది. సో బన్నీ, చెర్రీ, తారక్, ప్రభాస్, మహేశ్ ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా రెంుడ మూడేళ్లు సినిమాలతో బిజీ అవుతుంటే, చేసేదేం లేక అరవ స్టార్ల వైపు మిగతా దర్శకులు ఫోకస్ పెంచాల్సి వస్తోంది. అంతా బానే ఉంది కాని, అటు వైపు వెళ్లే వాళ్లలో సగానికి సగం ఇక్కడి హీరోలు రిజెక్ట్ చేసిన పీస్ లే అంటున్నారు. అది పూర్తిగా నిజం కాకపోయినా, ఇలాంటి కామెంట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు పెరిగాయి.