కల్కీ, దేవర, పుష్ప… 2024 లో ఇండియాను షేక్ చేసిన టాలీవుడ్

2024లో పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ను భారీగా పెంచాయి అనే చెప్పాలి. 2024లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఓ సెన్సేషన్ సృష్టించింది. వరస ప్లాపులుతో ఇబ్బంది పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 12, 2024 / 05:27 PM IST

2024లో పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ను భారీగా పెంచాయి అనే చెప్పాలి. 2024లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఓ సెన్సేషన్ సృష్టించింది. వరస ప్లాపులుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభాస్ కు ఈ సినిమా భారీ హిట్ ఇవ్వడమే కాకుండా ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. 1000 కోట్ల వసూళ్ళను సాధించి సౌత్ ఇండియా హీరోలతో పాటుగా బాలీవుడ్ హీరోలకు కూడా ఒక సవాల్ చేసింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కచ్చితంగా పెరిగిందనే చెప్పాలి. బాలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ ను ముందు తక్కువ అంచనా వేసినా ఈ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ పేరు వింటే చాలు భయపడిపోతున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ కు ఊహించని విధంగా వసూళ్లు రావడంతో రెండో పార్ట్ పై కూడా భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపుగా రెండో పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. ఇక 2025 వేసవి తర్వాత మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి 2026లో విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారు.

ఇక ఈ ఏడాది తెలుగులో విడుదలైన మరో సినిమా దేవర కూడా సంచలనమైంది. భారీ అంచనాలతో వచ్చిన దేవరా సినిమాను యాంటీ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో టార్గెట్ చేశారు. సినిమా బాగున్న సరే బాగా లేదంటూ ప్రచారం గట్టిగానే జరిగింది. అయినా సరే ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా కన్నడ తమిళ భాషల్లో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిపోయాడు.

ప్రస్తుతం వార్ 2 సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ ఏడాది చివర్లో విడుదలైన పుష్ప 2 సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా అత్యంత వేగంగా 1000 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను కూడా నెగిటివ్ పబ్లిసిటీ బాగానే ఇబ్బంది పెట్టింది. అయినా సరే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో బిగ్ హిట్ కొట్టాడు. నార్త్ లో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఈ సినిమాకు పార్ట్-3 కూడా ఉంటుందని ప్రకటించారు. తెలుగు కంటే ఈ సినిమా నార్త్ లోనే ఎక్కువగా ఫేమస్ కావడంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్ లో భారీ మార్కెట్ క్రియేట్ అయింది అని చెప్పాలి. ఇలా 2024 తెలుగు సినిమాకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.