TOLLYWOOD DRUGS: పూరీ రక్తంలో ఆ ఆనవాళ్లు..? డ్రగ్స్‌ కేసులో సంచలన మలుపు

2018లో నమోదైన ఈ డ్రగ్స్‌ కేసులో చాలా మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్‌ నటులే టార్గెట్‌గా చాలా మంది సెలబ్రెటీలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద దుమారాన్ని రేపింది.

  • Written By:
  • Updated On - February 1, 2024 / 05:15 PM IST

TOLLYWOOD DRUGS: దాదాపు ఐదేళ్లక్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ కేసు లేపిన తుఫాను అంతా ఇంతా కాదు. 2018లో నమోదైన ఈ డ్రగ్స్‌ కేసులో చాలా మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్‌ నటులే టార్గెట్‌గా చాలా మంది సెలబ్రెటీలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద దుమారాన్ని రేపింది. చాలా మంది జీవితాల్లో మాసిపోని మచ్చగా మిగిలిపోయింది.

PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్

అలాంటి డ్రగ్స్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో నమోదైన 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. డ్రగ్స్‌ కేసుపై ప్రత్యేకంగా అప్పట్లో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం.. నెలల తరబడి విచారణ కొనసాగించింది. కేసుతో సంబంధం ఉంది అనుకున్న ప్రతీ ఒక్కరికీ నోటీసులు ఇచ్చి విచారించింది. కొందరి నుంచి శాంపిల్స్‌ కూడా కలెక్ట్‌ చేశారు అధికారులు. డ్రగ్స్‌ తీసుకున్నారు అన్న అనుమానం ఉన్న సినీ ప్రముఖుల గోళ్లు, వెంట్రుకలు సేకరించారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు కూడా పంపించారు. కానీ ఈ టెస్ట్‌లలో డైరెక్టర్‌ పూరీ, హీరో తరుణ్ శాంపిల్స్‌ను మాత్రమే పరీక్షించారు డాక్టర్లు. ఇద్దరి శాంపిల్స్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని చెప్పారు.

ఇదిలా ఉండగానే ఇప్పుడు కోర్టు ఈ కేసులను కొట్టి వేయడం సంచలనంగా మారింది. టాలీవుడ్‌ ప్రముఖులకు వ్యతిరేకంగా మొత్తం 8 కేసులు నమోదు చేశారు అధికారులు. ప్రస్తుతం అందులో 6 కేసులు కొట్టివేసింది కోర్టు. ఈ ఆరు కేసుల్లో లీగల్‌ ప్రొసీజర్‌ సరిగ్గా పాటించలేదని జడ్జ్‌ అభిప్రాయపడ్డారు. దాంతో పాటు క్లినికల్‌ టెస్ట్‌లో కూడా నెగటివ్‌ రిపోర్ట్‌ రావడం, సరైన ఆధారాలు లేకపోవడంతో ఆరు కేసులను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన రెండు కేసుల్లో ఎలాంటి డెవలప్‌మెంట్స్‌ ఉంటాయి అనేది చూడాలి.