దేవర మూవీ రాగానే 172 కోట్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కాని రివ్యూలు, మిక్స్ డ్ గా వచ్చాయి. బేసిగ్గా ఓ హీరో హిట్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. కాని మొదటి రోజు నెగెటీవ్ టాక్ తో వచ్చిన సినిమా వందలకోట్ల వసూళ్లు రాబట్టడం చాలా రేర్.. అదే జరిగితే అది హిస్టరీ కాదు అద్భుతం అనాల్సిందే… దేవర విషయంలో అదే జరిగింది. లేకపోతే ఓపెనింగ్స్ ని పక్కన పెడితే, మొదటి రోజు టాకే షాక్ ఇచ్చింది… అయినా ఆ టాక్ ని వీక్ చేశాయి వసూల్లు… భారీగా కలెక్షన్స్ రావటంతో, నెగెటీవ్ టాక్ కి బ్రేక్ పడింది. కుల్లు బ్యాచ్ వొళ్లు హూనమైంది… ఇంత జరిగినా, సీన్ లో కి ఎవరైనా పోటీ కొస్తే, పంచ్ పడినట్టే… అందుకే దేవర దరువుకి భయపడి దసరాకి దూరంగా ఉండాలని సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయించాడు. కాని తన హెల్త్ ఇష్యూ వల్ల తర్వాత ప్రమోషన్స్ కి కష్టమని మళ్లీ వాయిదా అన్న ఆలోచనని పక్కన పెట్టాలా అని కన్ ఫ్యూజన్ లో పడింది సినిమా టీం. అంతా బానే ఉంది కాని, వెట్టయాన్ టైటిల్ పేరు మారకుండా, అదే తమిళ టైటిల్ తో తెలుగులో సినిమారిలీజ్ అంటే జనం మండిపడుతున్నారు. సోసల్ మీడియాలో ఈ విషయం మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఐతే తమిళ అహంకారాన్ని దేవర చూసుకుంటాడనే కామెంట్లు కామనయ్యాయి….. రజినీకాంత్ ఆరోగ్యం బాగుండాలి, అలానే తమిళ టైటిల్ తోనే తెలుగులో వెట్టయాన్ ని రీలీజ్ చేయాలనే అహంకారపు ప్రయత్నానికి బ్రేక్ పడాలి.. ఇది తెలుగు బ్యాచ్ కోరుకుంటోంది.. మరి రియాలిటీలో ఏంజరుగుతోంది?
తెలుగు సినిమా ను తెలుగు టైటిల్ తో కాదు, తమిళ టైటిల్ తో పెడితేనే అరవ జనం చూడట్లేదు. అలాంటిది ఓ తమిళ మూవీ తమిళ టైటిల్ తో వెట్టయాన్ అని తెలుగులో సినిమా రిలీజ్ చేస్తే ఇక్కడి జనం చూస్తారా?
సరే ఇదే పని ఓ తెలుగు హీరో చేస్తే, అక్కడి జనం ఊరకుంటారా? ఇది బేసిగ్గా వెట్టయాన్ మూవీ టీం చేసిన తప్పుని ప్రశ్నిస్తున్న సగటు నెటీజన్ వాదన.. అసలు వెట్టయాన్ అంటే ఎవరు? సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అయినంత మాత్రనా అరవ టైటిల్ పెట్టి, అర్ధం కాని పదంతో సినిమా రిలీజ్ చేస్తే తెలుగు వాళ్లు
ఆ సినిమాని చూసేస్తారా?
ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో వైరలౌతున్నాయి. రజినీకాంత్ గొప్ప క్రేజ్ ఉన్న నటుడు. మంచి సంస్కారవంతుడు. అందులో ఏడౌట్ లేదు. వెట్టయాన్ మూవీ తీసిన గ్నాన్ వేల్ గతంలో జైభీమ్ తో ఓటీటీ ని ఏలాడు.. తను కూడా విషయం ఉన్న దర్శకుడనే తేలింది.
అలాంటి డైరెక్టర్, రజినీకాంత్ తో తీసిన వెట్టయాన్ ని తెలుగులో తెలుగు పేరుతో వేటగాడనో మరోటనో టైటిల్ పెట్టి వదిలితే సమస్యే లేదు. అర్ధంకాని తమిళ పదాన్ని తెలుగు జనాల మీద రుద్దడం అహంకారామా? అగ్నానమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి
సరే రజినకాంత్ కి ఆరోగ్యం బాలేదు. కాబట్టి తను ప్రమోషన్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. కాని ఫిల్మ్ టీం ఏం చేస్తోంది. చిన్న టైటిల్ పెట్టడానికి కూడా వాల్లకు కుదరట్లేదా? తెలుగులోనే కాదు హిందీలో, కూడా ఈ సినిమాను ఇదే టౌటిల్ తో రిలీజ్చేస్తున్నారట…
అసలు తెలుగు సినిమాలెంతగా పాన్ ఇండియాను షేక్ చేస్తున్నా తమిళ నాట మన మూవీలను వాల్లు చూసేది తక్కువ. సరే క్వాలిటీ బాలేదా అంటే, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కీ, పుష్ప ఇవన్నీ సాలిడ్ కంటెంట్ తో వచ్చిన మూవీలే… మరెందుకు వాటికి కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే, అక్కడ తక్కువ వసూల్లు వస్తున్నాయి
అంతే తమిల జనమే గొప్ప, తమిళ సంస్క్రుతే గొప్ప అని వాళ్లనుకోవటం తప్పులేదు. కాని మిగతా భాషల్ని, ప్రాంతాలని లెక్కచేయకపోతే, అక్కడ జనం కూడా రియలైజ్ అవటం కాదు, రివర్స్ అయ్యేచాన్స్ఉంది. వెట్టయాన్ అంటూ తమిళ టైటిల్ తోనే రజినీకాంత్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయటానికి అక్కడి దర్శక నిర్మాతల తప్పా, లేదంటే తెలుగు రైట్స్ కొన్న నిర్మాత సోమరితనంతో అలా చేశాడా అన్న ప్రశ్నలు ఎదురౌతూనే ఉన్నాయి…
అసలే దేవర దుమ్ముదులుపుతున్న టైంలో, వెట్టయాన్ వస్తే వసూల్ల కోత పడుతుందంటున్నారనే, దసరా నుంచి దీపావళికి వాయిదా అన్నారు. మళ్లీ రజినీకాంత్ హెల్త్ కండీషన్ వల్ల, ఎందుకొచ్చిన ఇబ్బందని, దసరాకే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఇంతకటి కన్ ఫ్యూజన్ లో వెట్టయాన్ టైటిల్ తో సినిమా తెలుగులో వస్తుండటంతో, ఇది అరవ అహంకారమే అన్న కోపాలు, ప్రశ్నల రూపంలో సోషల్ మీడియాలో పెరిగాయి.