యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది.. ఎవరికీ సాధ్యం కాని విధంగా కలెక్షన్లు, కమిట్‌మెంట్లు సెట్ చేస్తూ మెంటలెక్కించేస్తున్నాడు. సలార్ బ్లాక్ బస్టర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన ఈ డైనోసార్.. తన మార్కు బిజినెస్‌తో ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా విడుదలైన సలార్ ఇప్పటి వరకు 700కోట్లు వసూలు చేసింది. ఈ సంక్రాంతి వరకు దీని రన్ ఉండబోతుంది. తన కటౌట్‌కు తగ్గ కంటెంట్ పడితే.. తన రికార్డుల ఊచకోత ఎలా ఉంటుందో ప్రభాస్ మరోసారి చూపించాడు. సలార్ కలెక్షన్లతో తన స్టామినో ఏంటో ప్రూవ్ చేసాడు. ప్రభాస్ పనైపోయిందన్న వాళ్ల నోళ్లను తన కలెక్షన్లతో మూయించేశాడు. దీంతో.. ఇప్పుడు ఇండియన్ సినిమా చూపంతా ప్రభాస్ చేయబోయే నెక్ట్స్ మూవీస్ పైనే ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆరు సినిమాలు.. ఆరు వేల కోట్ల మార్కెట్‌తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.
ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా చేతిలో ఇప్పుడు ఏకంగా ఆరు ప్రాజెక్ట్ లున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. అన్ని సినిమాల టార్గెట్ మినిమమ్ వెయ్యి కోట్లు.. అంటే వచ్చే రెండు మూడేళ్లలో ప్రభాస్ పేరుతో జరిగే బిజినెస్ ఆరు వేల కోట్లకు పైగా ఉండబోతోంది. ఇక.. ప్రభాస్ నుంచి ఇమ్మీడియెట్‌గా రిలీజ్ కాబోతున్న మూవీ కల్కి2898ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ నుంచి రెండువేల కోట్ల బిజినెస్‌ని ఆశిస్తున్నారు మేకర్స్. పైగా ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. బాహుబలి 2 రికార్డ్స్‌ను బ్రేక్ చేయడమే టార్గెట్‌గా ఈ మూవీని రెడీ చేస్తున్నారు.
ఇక దీంతోపాటు చిన్న సినిమా చేశాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. దీంతోపాటు యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ సెట్ చేశాడు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రెబల్ లుక్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిట్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు సలార్ 2 రానుంది. సలార్ పెద్ద హిట్ కావడం, మొదటి భాగంలో చాలా అంశాలను సస్పెన్స్ తో వదిలేయడంతో రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. ఇక వీటితో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్.. మరోవైపు మంచు విష్ణ, మోహన్‌బాబు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. ఇలా ప్రభాస్ నటించే ఆరు సినిమాలతో, ఆరు వేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా ఒక హీరో పేరుతో ఇన్ని వేల కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.. ఈ లెక్కలన్నీ ప్రభాస్ స్టామినా ఏంటో తెలియజేస్తున్నాయంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.