MAHESH BABU-PRABHAS: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్‌లో జుట్టు స్టైల్ మార్చింది మూడు సార్లే. ఒకటి పోకిరికి ముందు వరకు ఒకలా ఉన్న మహేశ్ బాబు, పోకిరి సినిమాలో లుక్ మార్చి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. తర్వాత అతిథి మూవీలో భారీగా జుట్టు పెంచి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ గుంటూరు కారం కోసమే జుట్టు పెంచి మతిపోగొట్టాడు.
SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్
అయితే ఈ సారి మాత్రం జుట్టు పెంచటం అంటే వత్తుగా కాదు, పొడుగ్గా పెంచి పోనీ టైయిల్‌కి సరిపోయేంతగా తన లుక్‌ని మార్చేసుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నట్టుండి, ఇప్పుడు తను కూడా జుట్టు పెంచేశాడు. మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న ది రాజా సాబ్ మూవీ కోసమే ఇలా ప్రభాస్ తన లాంగ్ హేయిర్ అవతారంతో మతిపోగొడుతున్నాడు. బాహుబలిలో రాజుగా లాంగ్ హేయిర్‌తో కిక్ ఇచ్చిన ప్రభాస్, అంతకుమించి పొడవైన జుట్టుతో స్టైలే మార్చేశాడు. దేవరలో కూడా ఎన్టీఆర్ లాంగ్ హేయిర్ తో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రలో తారక్ లాంగ్ హేయిర్‌తో కనిపిస్తే, కొడుకు పాత్రలు మాత్రం చిన్న జుట్టుతోనే కనిపిస్తాయట.
టాలీవుడ్‌లో స్టార్స్ అంతా సడన్‌గా ఎయిటీస్, నైంటీస్‌లో హీరోలు పెంచుకున్నట్టు జుట్టు పెంచుకుంటున్నారు. అప్పట్లో హిప్పీ కటింగ్, పోనీ టేయిల్ కటింగ్ లాంటివే ఇప్పుడు మళ్లీ రాబోతున్నట్టున్నాయి. కింగ్ నాగార్జున, వెంకటేష్, చిరు, మిథున్ చక్రవర్తి అప్పట్లో ఈ స్టైల్లో జుట్టు పెంచారు. ఇప్పుడు ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ మాత్రమేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఇలానే లాంగ్ హేయిర్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది.