జైలర్, లాల్ సలామ్ తోపాటు గ్నాన్ వేల్ మూవీ ఇలా వరుసగా మూవీలకు కమిటౌతున్న తను లోకేష్ కనకరాజ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఇలా ఈ నాలుగు సినిమాలతో మూవీకి 250కోట్ల చొప్పున వెయ్యి కోట్లు వెనకేసుకోబోతున్నాడు. రెమ్యునరేసన్ ప్లస్ ఏరియా రైట్స్ రూపంలో రజినీ సినిమాకో 250 కోట్లు దక్కించుకుంటున్నాడట
ఇక లియో సినిమా తీస్తున్న లోకేష్ కనకరాజ్ తర్వాత సూర్య మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఆతర్వాతే రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఈముగ్గురిలోఒకరి సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కి లోకేష్ కమిట్మెంట్ ఇచ్చాడని ఎప్పడి నుంచో చర్చ జరుగుతోంది. అలాంటిది సడన్ గా సీన్ లోకి రజినీకాంత్ వచ్చి, తనతో సినిమా చేయమనేసరికి లోకేష్ నో చెప్పలేకపోయాడట. సో లియో తర్వాత సూర్య మూవీ ఆతర్వాత రజినీకాంత్ సినిమా.. ఇలా చూస్తే రజినీ 4 సినిమాలతో వెయ్యి కోట్లకు సూటిపెడితే, రామ్ చరణ్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందట.