Tollywood: తెలుగు సినిమాకు ఐపీఎల్ దెబ్బ.. మళ్ళీ కష్టాల్లో తెలుగు సినిమా.. ఒక్క హిట్టు ఇవ్వండిరా బాబు!

జనాలు థియేటర్స్‌ వైపు చూడడం లేదు? దసరామూవీ రిలీజైన రోజు తప్ప ఆ తర్వాత సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస హిట్స్‌తో రవితేజ ఊపు మీద ఉన్నాడనుకుంటే.. రావణాసురకు ఓపెనింగ్స్ రాలేదు.

  • Written By:
  • Updated On - April 11, 2023 / 01:53 PM IST

Tollywood: తెలుగు సినిమా మళ్లీ కష్టాల్లో పడిందా? ఎందుకంటే థియేటర్స్‌లో మళ్లీ జనాలు కనిపించడం లేదు. ఆమధ్య కొంతకాలం తెలుగు సినిమా నష్టాలు చూసింది? రెండు నెలలపాటు ఒక్క హిట్టూ పడలేదు. జనాల్లేక థియేటర్స్‌ వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ అలాంటి పరిస్థితే తెలుగు సినిమా ఫేస్‌ చేస్తోంది అనిపిస్తోంది.

జనాలు థియేటర్స్‌ వైపు చూడడం లేదు? దసరామూవీ రిలీజైన రోజు తప్ప ఆ తర్వాత సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస హిట్స్‌తో రవితేజ ఊపు మీద ఉన్నాడనుకుంటే.. రావణాసురకు ఓపెనింగ్స్ రాలేదు. మీటర్‌తో మాస్‌ హీరో అనిపించుకోవాలన్న కిరణ్‌ అబ్బవరం కోరిక తీరలేదు. ఫిబ్రవరి, మార్చిని సినిమాలకు అన్‌సీజన్‌ అనిచెబుతారు. కానీ.. అన్‌ సీజన్‌లో వచ్చిన బలగం, సార్‌ మంచి సినిమాలని టాక్ తెచ్చుకున్నాయి. కానీ, థియేటర్‌లో కంటే ఓటీటీలోనే బాగా ఆడాయి.

అయితే, సినిమాలకు మంచి సీజన్‌గా భావించే సమ్మర్‌లో వస్తున్న చిత్రాలకు ఆదరణ దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సమ్మర్‌లో వచ్చిన చిత్రాలు చేతులు ఎత్తేయడం వెనకాల రెండు బలమైన కారణాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌లో లక్షల మంది వున్నారు. కొత్త సినిమాలను వీళ్లెవరూ పట్టించుకోవడం లేదు. దీని తర్వాత కలెక్షన్స్ లేక థియేటర్స్‌ వెలవెల బోవడానికి ఐపీఎల్‌ మెయిన్‌ రీజన్‌. దసరా రిలీజైన మరుసటి రోజే ఐపీఎల్‌ మొదలైంది. ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమా సీజన్‌పై పడింది. క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోవడంతో ఆ ప్రభావం మూడు ఆటలపై పడుతోంది. ముఖ్యంగా మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్‌ షోలకు పెద్దగా టిక్కెట్లు తెగడం లేదు.

దీనికి తోడు ఈ సమయంలో కాన్సెప్ట్ మూవీస్‌ రావడంతో ఆడియన్స్‌ కూడా థియేటర్స్‌ వైపు చూడటం లేదు. అటు సరైన సినిమాలు రాక.. ఇటు కలెక్షన్లు లేక.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మళ్లీ సంక్షోభంలో పడిందా అనిపిస్తోంది. అందుకే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఒక్క హిట్ పడాలి. రాబోయే చిత్రాల్లో అలాంటి హిట్‌ను ఏ మూవీ అందిస్తుందో చూడాలి.