Devi Sri’s leaks : దేవీశ్రీ లీకులతో ఊగిపోతున్న టాలీవుడ్‌..

పుష్పరాజ్‌గా వచ్చి రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ మూవీతో నేషనల్ బెస్ట్‌ హీరో అయిపోయాడు. పుష్పగా అల్లు వారి అబ్బాయి చేసిన రచ్చ ఇప్పటికీ తగ్గేదేలే అన్న రేంజ్‌లో దూసుకుపోతోంది.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది..

పుష్పరాజ్‌గా వచ్చి రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ మూవీతో నేషనల్ బెస్ట్‌ హీరో అయిపోయాడు. పుష్పగా అల్లు వారి అబ్బాయి చేసిన రచ్చ ఇప్పటికీ తగ్గేదేలే అన్న రేంజ్‌లో దూసుకుపోతోంది.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది.. ఈ క్రేజ్‌తోనే పుష్ప-2 కోసం యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో.. దేవి శ్రీ ప్రసాద్‌ లీకులు వదులుతూ పుష్ప-2 పై మరింత హైప్‌ను పెంచేస్తున్నాడు.. ఇంటర్వెల్‌ సీన్‌ ఓ సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందంటూ దేవి శ్రీ వదిలిన లీకుతో.. గూస్‌ బంప్స్ ఖాయమంటూ ఇప్పటి నుంచే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి మొదలు పెట్టేశారు.

ICC WORLD CUM LINEUP: టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే…..!

పుష్ప 2లో బ‌న్ని త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల్లో ఉద్వేగం నింపుతార‌ని దేవీ చెప్పడంతో.. పుష్ప-2 లో బన్నీ యాక్టింగ్ ఆకాశమే హద్దుగా ఉండబోందని ఇప్పటి నుంచే లెక్కలు మొదలైపోయాయి. పుష్ప లో అల్లు అర్జున్‌ను ఓ లెక్కలో చూపించిన లెక్కల మాస్టారు సుకుమార్.. పుష్ప-2తో బన్నీని మరింత పవర్‌ఫుల్‌ రోల్‌లో చూపించబోతున్నారని ఇప్పటికే టాక్ నడుస్తోంది.

అల్లు అర్జున్ పుష్ప 2ని గ్రాండ్ లెవల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. రాజమౌళి RRR కంటే పెద్ద స్థాయిలో హీరోయిజం ఎలివేట్ అవ్వాల‌ని భావించార‌ని కూడా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే.. కంటెంట్ కి తగ్గట్టు.. బన్నీ కటౌట్‌ను కూడా భారీత‌నంతో మ‌లిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షణ్ కంటెంట్ లో సూప‌ర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌నున్నార‌ట..

ముఖ్యంగా జాతర సీన్‌లో బన్నీ యాక్టింగ్ చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటూ ఇప్పటికే లీకులు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే బయటకు వచ్చిన బన్నీ లుక్‌ ఓ రేంజ్‌లో వైబ్రేషన్స్ సృష్టించింది.. ఇక.. ఇప్పుడు ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఇచ్చిన ఈ లీకులు.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి.