TOLLYWOOD: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఏడాది మాత్రం వివాదాలు, బూతులు, విమర్శలు, అవమానాలు.. ఇవే కనిపించాయి. వినిపించాయి. సినిమాల రిలీజ్‌లు, ప్రమోషన్లు, పాటలు, బాక్సాఫీస్‌లో సక్సెస్, ఫెల్యూర్స్‌తో పాటు వివాదాలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. త్రిషని రేప్ చేసే సీన్ ఛాన్స్ మిస్ అయ్యిందనే అర్ధం వచ్చేలా తమిళ నటుడు మన్సూర్ కామెంట్ చేయటం, త్రిష విమర్శించటం, ఖుష్బూతోపాటు చిరు కూడా త్రిషని సపోర్ట్ చేయటం తర్వాత మన్సూరే కోర్టుకెళ్లి అక్కడ చీవాట్లు తిన్నారు.
DEVARA: యంగ్ టైగర్ వేట.. మాస్ జాతరకు ఇంకా మిగిలింది 100 రోజులే.!
ఈఎపిసోడ్ సౌత్ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది మద్యలో వచ్చిన ఆదిపురుష్‌లో రాముడి లుక్ బాలేదని, గ్రాఫిక్స్ మరీ వరస్ట్‌గా ఉన్నాయని.. ఇక మాటలు, రచన, దర్శకత్వంతోపాటు హనుమంతుడిని ముస్లింలా చూపించారని ఇలా ట్రోలింగ్ పెంచారు. కోర్టులో కేసులు వేసే వరకుసీన్ మారిపోయింది. ఇక యానిమల్‌లో బూతులు, దిక్కుమాలిన సీన్లు, ఉన్నాయని ఒక వర్గం అంటే, నార్త్‌లో ఒక బ్యాచ్‌కి పనీ పాటలేదు.. సినిమాలు చూడటం రాదని సందీప్ రెడ్డి వంగ రివర్స్ కౌంటరక ఇచ్చాడు. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ఏడాది బిగినింగ్‌లో అక్కినేని.. తొక్కినేని, ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ అక్కినేని నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యేలా చేసింది. బాలయ్య వాఖ్యల్ని తప్పు పట్టడంతో అదో వివాదంగా మారినా త్వరగానే సర్దుకుంది. ఇక మంచు విష్ణు వచ్చి మనోజ్‌ని కొట్టడం, ఆ వీడియో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, తర్వాత మంచుబ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయనే కోణంలో ఆ వివాదం నెల వరకు కొనసాగింది.
పవర్ స్టార్ మూవీ బ్రోలో ఏపీ మినిస్టర్ అంబటి పాత్రను పోలిన పాత్ర పెట్టడంతో అదో వివాదంగా మారి కనీసం రెండు మూడు వారాలు ఆ ఎపిసోడ్ నడిచింది. సీనియర్ నటుడు నరేష్ భార్య రమ్య, తన ఎఫైర్ మీద ఫైర్ అవటం, తను మాత్రం మళ్లీ పెళ్లి అని సినిమా తీసి అదే జవాబు అన్నట్టు దాన్ని రిలీజ్ చేయటం ఒక ఎత్తైతే, మొన్నామధ్య సంతోషం అవార్డ్స్‌లో తమిళ, మలయాళ స్టార్స్‌కి అవమానం జరగటం మరో ఎత్తు. ఇదంతా సంతోషం పత్రిక ఎడిటర్, మెగా పీఆర్వో అంటూ ప్రచారం జరగటంతో అలాంటిదేం లేదని నిర్మాత అల్లు అరవింద్ వివరించే వరకు సీన్ మారింది. ఇలా ఈ ఏడాది ప్రతీ నెల, ప్రతీ వారం ఏదో ఒక వివాదం తలెత్తుతూనే వచ్చింది.