B.town 4 movies : టాలీవుడ్ మూవీలు…500 కోట్లు..

మామూలుగా ఏ ఇండస్ట్రీలోనైనా ముందుగా ఓన్ సినిమాల తర్వాతే.. డబ్బింగ్ లేదా ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ బీటౌన్ లో మాత్రం ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంత భాష సినిమాల సంగతిని వదిలేసి, టాలీవుడ్ ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు.

 

 

 

మామూలుగా ఏ ఇండస్ట్రీలోనైనా ముందుగా ఓన్ సినిమాల తర్వాతే.. డబ్బింగ్ లేదా ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ బీటౌన్ లో మాత్రం ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంత భాష సినిమాల సంగతిని వదిలేసి, టాలీవుడ్ ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు. డిస్ట్రిబ్యూటర్లు సైతం బీటౌన్ మూవీలను పక్కనబెట్టి, టాలీవుడ్ మూవీల సెటిల్ చేసుకునేపనిలోపడ్డారు. ఫలితంగా పోటీ ఏర్పడటమే కాదు.. మన సినిమాలకు ఊహించని విధంగా డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మూవీలన్నీ కూడా భారీ రేట్లకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.

బీటౌన్ లో కొన్నాళ్లుగా సౌత్ హవానే నడుస్తోంది.. బాహుబలి సిరీస్ సినిమాల మొదలుకొని ఈ ఏడాది రిలీజ్ అయిన హను మాన్ వరకు అన్ని సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లో సైతం భారీగా కలెక్షన్లు రాబట్టాయి.దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడి సినిమాలను కొనేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన కల్కి 2898 ఏడి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర పార్ట్ 1 మూవీస్ యొక్క నార్త్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ భారీ ధరకు దక్కించుకున్నారు. మొత్తం కలిపి రూ. 425 కోట్ల మేర అక్కడ బిజినెస్ జరుపుకున్నాయి. ఒక్కో సినిమా లెక్క చూస్తే మతిపోయేలా ఉంది.

పుష్ప ఫస్ట్ పార్ట్ సౌత్ లో ఫెయిల్ అయినా నార్త్ లో సూపర్ హిట్ అయింది.‌వంద కోట్ల‌కు పైగా నెట్ వసూళ్ళు అందుకుంది. ప్రస్తుతం పార్ట్ 2 కోసం మంచి డీల్ జరిగింది. హిందీ రైట్స్ 200 కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది. కల్కీ కూడా 100 కోట్లకు పైగా డిమాండ్ రాబట్టుకుందని అంటున్నారు. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా గట్టిపోటీనే ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ క్రేజ్ కు తోడు.. శంకర్ కాంబో కావటం ఈ సినిమాకు కలిసి రావడంతో.. గేమ్ చేంజర్ 75 కోట్లకు అమ్ముడుపోయినట్టగా తెలుస్తోంది. ఇక దేవర సినిమాకు కూడా భారీ రేటే పలికినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ తో దేవర 50 కోట్లు పలికినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ సినిమాలకు ఈస్థాయి రేట్లు దక్కడం ఆశ్చర్యమే అని చెప్పాలి.