DEVARA-OG: అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్‌తో ఇంట్రస్ట్ క్రియేట్ చేసి, రెండో భాగం కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేస్తున్నారు. ఇంతకీ ఈ డబుల్ ధమాకా ఫార్ములా అప్లై చేస్తున్న సినిమాలేంటి..? టాలీవుడ్‌లో రెండు భాగాలుగా కథలు చెప్పడమనే ట్రెండ్ బాహుబలితోనే మొదలైంది. ఆ తర్వాత కేజీఎఫ్, పొన్నియన్ సెల్వం సినిమాలు ఇదే ఫార్ములా అప్లై చేసి కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాయి.
పుష్ప టీం కూడా ఒక కథతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే అది కూడా వర్కౌట్ అయింది. మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. రెండో భాగం కోసం ఆతృతగా ఎదురుచూసేలా చేసింది. తాజాగా ఈ జాబితాలో మరికొన్ని సినిమాలు చేరాయి. దేవర సినిమా మొన్నటి వరకు సింగిల్ ప్రాజెక్టే అనుకున్నారు. కానీ సడన్‌గా రెండో భాగం అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు కొరటాల. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న.. సెకండ్ పార్ట్ 2026లో విడుదల చేసేలా ప్రభాస్ సలార్ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని సీజ్‌ఫైర్ పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ 2027లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ కల్కిని కూడా రెండు, మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ టైంలో మిగత వాటిపై క్లారిటీ ఇస్తారట మేకర్స్. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారట దర్శకనిర్మాతలు. వీటిలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఒకటి కాగా.. మరోకటి హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలు టూ పార్ట్స్‌గా వచ్చే అవకాశం కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కనున్న మూవీ కూడా రెండు భాగాలుగా రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా టిల్లు స్క్వేర్, గూఢచారి 2, హిట్ 3, డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్స్ కూడా సీక్వెల్స్గానే రాబోతున్నాయి. భవిషత్తులో ఇంకెన్నిసినిమాలు డబుల్ ధమాకా ట్రెండ్‌ని ఫాలో అవుతాయో చూడాలి.