పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాలంటే, టాలీవుడ్ నుంచి హీరో అడుగు బయట పడాలి. బేసిగ్గా బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వాలంటే కూడా టాలీవుడ్ హీరోనే రంగంలోకి దిగాలి. ఆవిషయంలోనే మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ మంత్ ఎండ్ దేవరగా వస్తున్నాడు. డిసెంబర్ లో పుష్ప 2 తో ఐకాన్ స్టార్ దండెత్తబోతున్నాడు. అదే నెలాఖర్లో అంటే ఈ ఇయర్ ఎండ్ కి గేమ్ నే ఛేంజ్ చేస్తా అంటున్నాడు గ్లోబల్ స్టార్. ఈ ముగ్గురి మీదే పాన్ ఇండియా మార్కెట్ భవిష్యత్తు ఆధారపడింది. కోలీవుడ్ స్టార్లు ఫేలయ్యారు… శాండిల్ వుడ్ నుంచి బాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియాను షేక్ చేయటంలో ఫేలయ్యారు.. లాస్ట్ ఇయర్, ఈ ఏడాది ఇలా రెండు సార్లు రెబల్ స్టారే పాన్ ఇండియాని షేక్ చేశాడు.. సో మళ్లీ పాన్ ఇండియా షేక్ అయ్యేది తెలుగు హీరోతోనేనా? హావేలుక్
దేవర ఈనెల 27న రిలీజ్ కాబోతోంది. తర్వాత 2 నెలల గ్యాప్ తో డిసెంబర్ 6 న ఐకాన్ స్టార్ మూవీ పుష్పరాజ్ 2 రాబోతోంది. ఆవెంటనే 15 రోజులకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కన్ఫామ్ అయ్యింది. ముగ్గురూ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన స్టార్లే. పాన్ ఇండియా హిట్స్ తర్వాతే యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. పుష్ప హిట్ తర్వాతే స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ గా మారాడు. మెగా పవర్ స్టార్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు..
సో పాన్ ఇండియా రేంజ్ లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ముగ్గురు హీరోలకి హిట్లతో పాటు, మార్కెట్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. అలాంటి ఈ ముగ్గురి లో ఎవరి మూవీ వచ్చినా పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే. ఆల్రెడీ దేవర కి భారీ హైప్ రావటం, రిలీజ్ కిముందే నార్త్ ఇండియా, ఓవర్ సీస్ లో ప్రీరిలీజ్ బిజినెస్ 500 కోట్లు దాటటంతో, సౌత్ లెక్కల ప్రకారం ఈజీగా వెయ్యికోట్ల వసూళ్లు తేలికే అనంటున్నారు
పుష్ప హిట్ కాబట్టి, దాని సీక్వెల్ ఆటోమేటిగ్గా హిట్ అవుతుంది. కేజీయఫ్ తర్వాత కేజీయఫ్ 2 కి 1200 కోట్లు వచ్చినట్టు, బాహుబలి తర్వాత బాహుబలి 2 కి 1800 కోట్లు వచ్చినట్టు, పుష్ప హిట్ తర్వాత వచ్చే సినిమాపుష్ప 2కి ఈజీగా 1000 కోట్ల పైనే వసూళ్లు వచ్చే ఛాన్స్ఉంది. ఇదే జరిగితే, రెండు నెల్ల గ్యాప్ లో రెండే తెలుగు సినిమాలు రెండు సార్లు వెయ్యికోట్ల వసూల్లు రాబట్టినట్టౌతుంది.
శంకర్ మేకింగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన గేమ్ ఛేంజర్ హిట్టైనా వెయ్యికోట్ల వసూళ్లు పెద్ద విషయమే కాదు. సో పుష్ప2, దేవర , గేమ్ ఛేంజర్ హిట్ అయితే ఒక లెక్క, ఒక్కో మూవీ 1000 కోట్లు రాబడితే ఇంకోలెక్క . ఎందుకంటే కల్కీతో ఆల్రెడీ ఈ ఏడాది 1195 కోట్లతో వెయ్యికోట్ల క్లబ్ లో రెబల్ స్టార్ అడుగుపెట్టాడు. అలానే బన్నీ, తారక్, చరణ్ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెడితే, హిస్టరీ రీసౌండే.. ఎందుకంటే బాలీవుడ్ లో ఈ ఏడాది వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టే మూవీ రాలేదు. అక్కడ బీటౌన్ లో దంగల్, పటాన్, జవాన్ మాత్రమే వెయ్యికో్ట్ మూవీలు.. టాలీవుడ్ లో మాత్రం బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కీ ఈమూడు వెయ్యికోట్ల సినిమాలు.. ఇప్పడు రాబోయే 3 కూడా ఇలా నే వెయ్యికోట్లు రాబడితే, ఇంక ఇండియా నెంబర్ వన్ అంటే టాలీవుడ్డే అనాల్సి వస్తుంది.