DEVARA-KALKI 2898 AD: ఏ సినిమా ఎప్పుడు రిలీజ్.. అంతా కన్ఫ్యూజన్..

పుష్ప 2 కూడా దసరాకు వాయిదా పడే అవకాశం ఉంది. షూటింగ్‌కి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సుకుమారే దగ్గరుండి చేయించాల్సి రావటంతో, షూటింగ్ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటున్నారు.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 06:33 PM IST

DEVARA-KALKI 2898 AD: మే 9కి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజ్ అని ఎనౌన్స్ చేసి రెండు వారాలు కూడా గడవలేదు. ఇంతలోనే ఈ సినిమా వాయిదా దాదాపు ఖాయమైంది. కొత్త రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవటం దేవుడెరుగు.. ఇంకా 20 శాతం షూటింగ్ కూడా పూర్తికావాల్సి ఉంది. అందుకే ఆగస్ట్ 15కి వాయిదా వేయాలనుకుంటున్నారట. కాని అప్పుడు పుష్ప 2 రిలీజ్ ఉంది కదా అనుకుంటే, అక్కడే ట్విస్ట్ ఉంది.

Devara: దేవర క్లైమాక్స్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే.. జూనియ‌ర్ కోసం భారీ సెట్…?

పుష్ప 2 కూడా దసరాకు వాయిదా పడే అవకాశం ఉంది. షూటింగ్‌కి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సుకుమారే దగ్గరుండి చేయించాల్సి రావటంతో, షూటింగ్ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటున్నారు. అలా చేస్తే పుష్ప 2 ప్రమోషన్‌కి టైం కేటాయించే ఛాన్స్ తక్కువ. కాబట్టే దసరాకు లేదంటే డిసెంబర్‌కి పుష్ప 2ని వాయిదా వేయాలనే ఆలోచనలో సుకుమార్ టీం ఉంది. కాబట్టే ఆగస్ట్ 15కి కల్కిని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవర కూడా ఏప్రిల్ 5కి రిలీజ్ అన్నారే కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తే అది కూడా రిలీజ్ వాయిదా వేసుకోక తప్పేలా లేదు. సెప్టెంబర్‌కి దేవర వాయిదా పడే ఛాన్స్ ఉందట.

ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కి ఎన్టీఆర్ టైం ఇచ్చేలా లేకపోవటం, దీంతో సలార్ 2ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేయటం.. ఇవన్నీ చూస్తుంటే, డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతికి సలార్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సలార్ 1 తీసేప్పుడే సలార్ 2 తాలూకు కొంత షూటింగ్ జరిగింది. సో.. ఇదే జరిగితే డిసెంబర్‌లో రావాల్సిన రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌కి వాయిదా పడొచ్చు. ఇలా పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదాలకే మొగ్గు చూపుతున్నాయి.