ALLU ARJUN-PRABHAS: 2024లో ఫస్ట్‌డే సెంచ‌రీ కొట్టే హీరో అత‌డేనా..?

గ‌త ఏడాది ప‌ఠాన్, లియో సినిమాలు తొలి రోజే సెంచ‌రీ కొట్టాయి. షారుక్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ 106 కోట్ల వ‌సూళ్లు ఓపెనింగ్స్ రూపంలోనే రాబ‌ట్టింది. గత ఏడాది ట్రాక్ రికార్డును 2024లో ఏ హీరో బ్రేక్ చేస్తాడు అన్న‌ది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 02:33 PM IST

ALLU ARJUN-PRABHAS: ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల కాలం నడుస్తోంది. మ‌ల్టీ లాంగ్వేజ్ యాక్ట‌ర్స్‌తో వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక బ‌డ్జెట్‌తో పాటు.. వసూళ్ల లెక్క‌లు కూడా మారిపోతున్నాయి. తొలి రోజే వంద‌ల కోట్లు సాధించ‌డం అన్న‌ది ఓ టార్గెట్‌గా మారిపోయింది. ఫ‌స్ట్‌డే సెంచ‌రీ కొట్టిన సినిమాల క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. ఇక‌.. గ‌త ఏడాది ప‌ఠాన్, లియో సినిమాలు తొలి రోజే సెంచ‌రీ కొట్టాయి. షారుక్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ 106 కోట్ల వ‌సూళ్లు ఓపెనింగ్స్ రూపంలోనే రాబ‌ట్టింది.

TOLLYWOOD MOVIES: అసలేం జరుగుతోంది! పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా..

అటుపై త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన లియో ఏకంగా ప‌ఠాన్ రికార్డును చెరిపేసి ఏకంగా 145 కోట్ల వ‌సూళ్ల‌ను తొలిరోజే సాధించింది. షారుక్ జ‌వాన్ కూడా సెంచ‌రీ మైలురాయిని అందుకుంటుంద‌ని భావించినా.. రూ.75 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక.. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ స‌లార్ కూడా రూ.93 కోట్ల‌తో సెంచరీకి చేరువ‌లోకి వ‌చ్చింది కానీ, ఆ మార్కును అందుకోలేక‌పోయింది. అయితే.. ఇప్పుడు కొత్త ఏడాదిలోకి ఎంట‌ర్ అయిపోయాం. గత ఏడాది ట్రాక్ రికార్డును 2024లో ఏ హీరో బ్రేక్ చేస్తాడు అన్న‌ది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల‌పై విప‌రీత‌మైన హైప్ ఏర్ప‌డింది. ఈ లైన్‌లో హృతిక్ రోషన్ న‌టిస్తోన్న ఫైటర్ మూవీ ముందు వ‌రుస‌లో ఉంది. ఈ సినిమా తొలిరోజు రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. అయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మొద‌టి రోజు రూ.50 కోట్లు రావ‌డం కూడా క‌ష్టంగానే క‌నిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో.. హృతిక్ మిన‌హాయించి మిగ‌తా ఏ హీరోల‌కు ఆ రేంజ్ ఉంద‌న్న డిస్క‌ష‌న్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, బ‌న్నీలకు మాత్ర‌మే ఆ స‌త్తా ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ప్ర‌స్తుతం సుకుమార్.. బ‌న్నీతో పుష్ప‌-2 మూవీని పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెర‌కెక్కిస్తున్నాడు. పుష్ప‌-1కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పుష్ప‌-2 తొలి రోజు రూ.100 కోట్ల‌కు మించి వ‌సూళ్లు సాధింస్తుంద‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇక కొర‌టాల శివ‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం దేవ‌ర‌పై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. యంగ్ టైగ‌ర్ తొలి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌పై పంజా విస‌ర‌డం ఖాయ‌మన్న టాక్ న‌డుస్తోంది. ఇక‌.. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్ స్టార్ అయిన చెర్రీ.. గేమ్ ఛేంజ‌ర్ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఈ మూవీకి శంక‌ర్ డైరెక్ట‌ర్ కావ‌డం కూడా విపరీత‌మైన అంచ‌నాలను తెచ్చిపెడుతోంది. ఇక నాగ్ అశ్విన్.. ప్ర‌భాస్‌తో తెర‌కెక్కిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌ల్కీ 2898 ఏడీపై కూడా మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా న‌టించ‌డం స‌హా చాలా మంది స్టార్ హీరోలు భాగ‌మ‌వ్వ‌డంతో ఈ సినిమా రూ.200 కోట్ల‌కు పైగానే తొలిరోజు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని ట్రేండ్ అంచనా వేస్తోంది.. మ‌రి.. ఈ హీరోల్లో ఫ‌స్ట్‌డే సెంచ‌రీ వ‌సూళ్లు రాబ‌ట్టేదెవ‌రో చూడాల్సిందే.