తమిళ్ హీరోలు జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారా…? ఎలివేషన్ తో కోట్లు

తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 06:34 PM IST

తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమాల్లో కథ పెద్దగా ఉండటం లేదు కాని వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందంటున్నారు సినిమా జనాలు. సినిమా ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేస్తూ అక్కడి హీరోలు హిట్ కొడుతున్నారనే టాక్ వస్తోంది.

ఇతర భాషల్లో సాధ్యం కాని హిట్ లు అక్కడ కథలో పట్టు లేకపోయినా సాధ్యం అవుతున్నాయి. అది ఎలా అంటే అక్కడి డైరెక్టర్లు ఇప్పుడు ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా “ఎలివేషన్” అనే సూత్రం ఫాలో అవుతూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను హిట్ కొడుతున్నారు. ఎస్ సీనియర్ హీరోల సినిమాలు అన్నీ దాదాపుగా ఇదే విధంగా ఉన్నాయి. విక్రమ్ సినిమాలో కథ పెద్దగా ఉండదు. కాని అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చాడు. లోకేష్ కనగరాజ్ ఎలివేషన్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత వచ్చిన జైలర్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంది. అసలు జైలర్ సినిమాలో కథ ఏ మాత్రం లేదు. కాని సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. దీని వెనుక కూడా అనిరుద్ ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ సీన్స్ రాసుకోవడం వాటికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హైప్ తీసుకు రావడం జరుగుతోంది. ఇక కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఆ సినిమాలో కాస్త కథ ఉంటుంది. ఇక ఇప్పుడు వచ్చిన వేట్టాయన్ సినిమా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దాదాపు అలాగే ఉంది.

దీనితో తమిళ సీనియర్ హీరోలను మన తెలుగు హీరోలు కూడా ఫాలో అవ్వాలి అంటున్నారు ఇక్కడి ఫ్యాన్స్. మన తెలుగు హీరోలు కథలు వెతుక్కుని, సినిమా కోసం కష్టపడి హిట్స్ కొడుతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంతే గాని జనాల మీద తమ స్టార్ ఇమేజ్ రుద్ది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హిట్ లు కొట్టడం లేదు. అఖండ, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, ఇప్పుడు సీనియర్ హీరోలు చేసే సినిమాల్లో హీరోల కష్టం క్లియర్ గా కనపడుతోంది. తమిళ హీరోలను ఫాలో అయి కష్టం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.