టాలీవుడ్ కి పెళ్లి సందడి వచ్చింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, శోభితల వివాహం జరుగుతోంది. డిసెంబర్ నాలుగున వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అతి తక్కువ మంది అతిధులతో ఈ వివాహం చేస్తున్నట్టు అక్కినేని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. అలాగే కీర్తి సురేష్ వివాహం కూడా డిసెంబర్ 11వ తేదీ తన ప్రియుడుతో జరగబోతోంది. ఈ వివాహంపై కీర్తి కుటుంబం ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది.
తన చిన్న నాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్ తో ఆమె వివాహం జరగనుంది. ఈ వివాహం గోవాలో ప్లాన్ చేసారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. లేటెస్ట్ గా అక్కినేని అఖిల్ కూడా పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటన చేసాడు. జైనాబ్ తో అఖిల్ వివాహం చేసుకుంటున్నట్టు… ఇప్పటికే నిశ్చితార్ధం కూడా నిర్వహించినట్టు నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వచ్చే ఏడాది ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ వివాహం జరగనుంది. హిందూ ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరగనుంది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజు కూడా వివాహం చేసుకున్నాడు. ఏ మాత్రం హడావుడి లేకుండా సైలెంట్ గా ఈ వివాహం చేసుకుని షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాలీవుడ్ జనాలకు గుడ్ న్యూస్ చెప్పాడు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన సుబ్బరాజు పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుబ్బరాజు… పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి.
47 ఏళ్ల వయసులో ఈయన ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నాడు సుబ్బరాజు… తన భార్యతో బీచ్ పక్కన నిల్చొని ఉన్న ఫోటోలను సుబ్బరాజు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అమ్మాయి ఎవరు ఏంటీ అనే విషయాలు మాత్రం సుబ్బరాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అమ్మాయిది గోదావరి జిల్లా అనే వార్తలు వస్తున్నాయి. తన క్లోజ్ ఫ్రెండ్ నే అతను వివాహం చేసుకున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ రేంజ్ లో పెళ్లి కూతురు ఉందని… ఏది ఏమైనా సుబ్బరాజు పెళ్లి చేసుకోవడం మాత్రం సంతోషకరమైన విషయం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత సుబ్బరాజు పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యాడు. హీరో కటౌట్ ఉన్నా సరే సుబ్బరాజు మాత్రం సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.