RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మూవీ దేవర.. జూనియర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు.. అయితే.. అయితే దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.. దేవర పార్ట్ 1 సినిమా 10 అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు.. కాగా.. ఇప్పుడు దేవర పార్ట్-2 సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
దేవర పార్ట్ 2 రిలీజ్ కావడానికి చాలానే టైం పట్టనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. అతి త్వరలో వార్ 2 మూవీ షూట్ లో పాల్గొననున్న ఎన్టీఆర్, దాని అనంతరం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ తీయనున్న మూవీ షూట్ లో పాల్గొననున్నారట.. ఇవి రెండు పూర్తి అయ్యే సమయానికి ఆయన దేవర 2 స్టార్ట్ చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అదే జరిగితే దేవర పార్ట్ -2 రిలీజ్ బాగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీంతో.. జూనియర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.. అయితే దీని గురించి మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు..
కాగా.. ఇప్పటికే దేవర నుంచి రిలీజైన గ్లింప్స్ మూవీపై అంచనాలను స్కై హైకి తీసుకువెళ్లాలి.. జూనియర్ మాస్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.. బాక్సాఫీస్ వద్ద దేవర రచ్చ ఖాయమంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.