TOLLYWOOD: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. దూకుడు మీద కనిపిస్తున్నారు. తన మార్క్ పాలన ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, వ్యవహారాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు రేవంత్. సీఎం దూకుడు ఇలా ఉంటే.. మంత్రుల కామెంట్లు కూడా ఇలానే కనిపిస్తున్నాయ్. ఐతే రేవంత్ నెక్ట్స్ టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తారా అని కూడా జనాల్లో కొత్త చర్చ మొదలైంది.
IAS IN TELANGANA: సచివాలయంలో అందమైన ఐఏఎస్.. తప్పనిసరిగా ఉండాల్సిందేనా..?
దిల్‌రాజు తప్ప.. సినిమావాళ్లు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని.. తనను కలవలేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్ చేయగా.. ఈ మాటల చుట్టే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. టాలీవుడ్ మీద, డ్రగ్స్ కేసు మీద రేవంత్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆ కేసులో ఏం తేల్చారు అంటూ బహిరంగంగానే ప్రశ్నలు గుప్పించారు. ఐతే దాని మీద ఆ సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. అసలు డ్రగ్స్ కేసులో ఏం జరిగిందని.. రేవంత్ బయటకు తీయబోతున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. అప్పట్లో డ్రగ్స్ కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు.. సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొంతమంది హీరోలు అరెస్ట్ కాబోతున్నారనే హడావుడి కూడా జరిగింది. ఐతే అకస్మాత్తుగా డ్రగ్స్ వ్యవహారం సైలెంట్ అయింది. టీపీసీసీ చీఫ్‌గా డ్రగ్స్ వ్యవహారాలపై రేవంత్ పోరాటాలు చేశారు.
కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ డ్రగ్స్ వ్యవహారాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. మరిన్ని సంచనాలు కనిపించడం ఖాయం. డ్రగ్స్ కేసులో ఏం జరిగిందన్నది.. సామాన్యుల్లో ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. విచారణలో కనిపించిన హడావుడి.. ఆ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పడంలో ఎందుకు కనిపించలేదు అని సామాన్యుల్లోనూ ప్రశ్నలు వినిపించాయ్. టాలీవుడ్ పెద్దల తీరుపై కాంగ్రెస్ మంత్రుల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్ తెరమీదకు వస్తే పరిస్థితి ఏంటా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.