TOLLYWOOD: టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ భవిష్యత్తు..

దక్షిణాదిలో ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టడానికి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా.. నాగ్ అశ్విన్ కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప: ది రూల్, శంకర్ గేమ్ ఛేంజర్, Jr. NTR దేవర, కమల్ హాసన్ ఇండియన్-2, సూర్య కంగువ వంటి సినిమాలు బాలీవుడ్ గడ్డను ఏలడానికి రెడీ అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 05:13 PM IST

TOLLYWOOD: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నార్త్ అంటే.. బాలీవుడ్ సినిమాలను చాలా గొప్పగా, దక్షిణాది సినిమాలను చాలా తక్కువగా చేసి చూసేవారు. సౌత్ నటులు కూడా.. ఎప్పుడెప్పుడు బాలీవుడ్‌లో ఆఫర్ వస్తుందా అని ఎదురుచూసేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అందరికీ సౌత్ సినిమాలే దిక్కు అయ్యEయి. బాలీవుడ్ స్టార్స్ దిగి వచ్చి.. సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇదంతా రాజమౌళి కారణంగానే మారింది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జస్ట్ టెన్త్ పాస్.. నో ట్రోల్స్ ప్లీజ్ !!

రాజమౌళి బాహుబలి సిరీస్‌తో ఇది ప్రారంభమైంది. ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF.. భారతీయ సినిమాని తుఫానుగా తీసుకుంది. బాలీవుడ్ గడ్డపై హిందీ సినిమాలను డామినేట్ చేసి మరీ ఈ తెలుగు, కన్నడ సినిమాలు సత్తా చాటాయి. అప్పటి నుంచి ఎప్పటికీ అంతం లేని చర్చ సినీప్రియులలో మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులలో జరుగుతోంది. ఈ సంవత్సరం హిందీ చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే హిందీలో హిట్ టాక్ తెచ్చుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ ఓ సినిమాతో వచ్చినా ప్లాప్ మూటగట్టుకున్నాడు. దక్షిణాదిలో ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టడానికి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.

ముఖ్యంగా.. నాగ్ అశ్విన్ కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప: ది రూల్, శంకర్ గేమ్ ఛేంజర్, Jr. NTR దేవర, కమల్ హాసన్ ఇండియన్-2, సూర్య కంగువ వంటి సినిమాలు బాలీవుడ్ గడ్డను ఏలడానికి రెడీ అవుతున్నాయి. ఈ చిత్రాలన్నీ దక్షిణాది స్టార్ హీరోల మూవీలు కాగా.. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని పక్కకు నెట్టి మరీ ఇవి బాలీవుడ్ గడ్డను ఏలబోతున్నాయి.