TOLLYWOOD HEROES: పాన్ ఇండియా కల్చర్ వల్ల తెలుగు కథలు, హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. నిజానికి ఈ కల్చర్ వల్లఎక్కువగా లాభపడింది తెలుగు సినీ పరిశ్రమే అనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిట్టు పడటం వారి కెరీర్‌కు కీలకంగా మారింది.
TRIVIKRAM: త్రివిక్రమ్ ఫెయిల్యూర్.. వాళ్లను సంతోషపెడుతోందా..?
టాలీవుడ్ కుర్ర హీరోలు నితిన్, రామ్ పోతినేని, నాగ చైతన్య, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి స్టార్స్ అందరూ కూడా కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రామ్ పోతినేని స్కంద మూవీతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మెన్ సినిమాతో రెండు ఫ్లాప్‌లు అందుకున్నాడు. నిఖిల్ కూడా గత ఏడాది స్పై మూవీతో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరందరూ కూడా ఒక సక్సెస్ కావాలి అంటూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. అలాగే వేణు శ్రీరామ్‌తో ఒక సినిమాని సెట్స్‌పైకి తీసుకొని వెళ్ళాడు. రామ్ పోతినేని రెండు వరుస ఫ్లాప్‌ల మీద ఉండటంతో ఇప్పుడు మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌ని సెట్స్‌పైకి తీసుకొని వెళ్ళారు.
అటు వరుణ్ తేజ్.. ఆపరేషన్ వాలంటైన్ పేరుతో ఒక మూవీ, కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే మూవీ చేస్తున్నాడు. వీరితో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా హిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోలుగా నిలిచిన శ్రీవిష్ణు, నాగశౌర్యతో పాటు మరికొంతమంది యంగ్ యాక్టర్స్ కూడా ప్రస్తుతం విజయాల రేసులో వెనుకబడిపోయారు. ఈ హీరోల కెరీర్‌కు సక్సెస్ కీలకంగా మారింది. ఒక్క హిట్ కోసం ఈ ఏడాది ఈ హీరోలు అందరూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అప్‌కమింగ్ మూవీస్‌తోనైనా వారు విజయాల బాట పడతారో లేదో అన్నది తేలాల్సి ఉంది. మరి ఈ ఏడాది ఈ హీరోలలో ఎవరికి సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.