అంత పెద్ద పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా మాటే లేదు. ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు హాజరు కాలేదు. కనీసం అల్లు అర్జున్ కూడా చిరంజీవి గురించి ఒక్క మాట మాట్లాడలేదు.పైగా బన్నీ పదే పదే నా ఆర్మీ … నా ఆర్మీ అంటూ నేను వేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. పుష్ప ఈవెంట్ సాక్షి గా మెగా ఫ్యామిలీ తో అల్లు అర్జున్ బంధం తెగిపోయినట్లే.
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకటి కాదని తేలిపోయింది.రెండు కుటుంబాల మధ్య అల్లు అర్జున్ చిచ్చు పెట్టాడనే అనుకోవాలి.దశాబ్దాలుగా మెగా, అల్లు ఫ్యామిలీస్…ఒకే మాట మీద ఉన్నాయి. పుష్ప సినిమా తర్వాత…మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది అందుకే బాయ్‌కాట్ బన్నీ ట్రెండ్ అవుతోంది.జాతీయ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌కు…బలుపు బాగా పెరిగిందని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.సొంత ఇమేజ్‌తోనే ఎదిగాననేలా ఓవర్ యాక్షన్ చేస్తున్నడనేది కొందరి వాదన.
ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి..అల్లు అరవింద్…ఒకరికొకరు తోడుగా ఉన్నారు. గీతా ఆర్ట్స్‌లో హీరోగా చిరంజీవి నటించారు. ఎన్నో బంపర్ హిట్లు కొట్టారు. వారిద్దరి మధ్య ఎలాంటి ఇగోలు లేవు. రెండు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ, అప్యాయతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫీగా సాగిపోతున్న బంధాల్లోకి…పుష్ప విలన్‌లా ఎంట్రీ ఇచ్చాడు. అంతే…సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ అవార్డు రావడంతో మిడిసి పడుతున్నాడు. తనకంటే తోపులు ఎవరు లేరనేలా బిల్డప్ ఇస్తున్నాడు. అంతపెద్ద స్టార్ డమ్ ఉన్న చిరంజీవి కూడా ఇంతలా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఫ్యాన్ ఫోలోయింగ్ విపరీతంగా ఉన్న పవన్ స్టార్ ఎన్నడు అధిక ప్రసంగం చేయలేదు. ఈ రోజు హీరోగా ఉన్నానంటే కారణం…సుకుమార్ అన్నాడు అల్లు అర్జున్. స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుందని అన్నాడు. ప్రసంగంలో తొలి నుంచి అండగా నిలిచిన మెగాస్టార్ పేరు ప్రస్తావించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. వేదికను బట్టి చిరంజీవి గురించి మాట్లాడతారని, అక్కడ పుష్ప-2కు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడారని అల్లు అభిమానులు చెబుతున్నారు.
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మరోవైపు బెనిఫిట్ షోలు తీసుకోవడానికి మెగా అభిమానులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. బాయ్ కాట్ పుష్ప 2 ట్రెండింగ్ అవుతోంది. ఇది అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ గా మారింది. కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఫంక్షన్లకు అటెండ్ అవలేదు. దీంతో మెగా అభిమానులు పుష్ప 2 మూవీకి సపోర్ట్ చేయడం మానేశారు. సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కనీసం ఈ సినిమా టికెట్స్ కొనడానికి కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిని చూపించట్లేదు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి కుటుంబసభ్యులు దూరంగా ఉన్నారు. సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు. అటు వైసీపీ అభిమానులు సైతం అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.ఒక వైపు మెగా ఫ్యామిలీ రాకపోవడం…సోషల్ మీడియా బాయ్ కాట్ పుష్ప-2 ట్రెండింగ్ అల్లు అర్జున్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయినట్లు చర్చ జరుగుతోంది.
మెగాస్టార్ ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. ఏ ఫంక్షన్ జరిగినా…సినిమా ఈవెంట్ అయినా అంతా కలిసిపోతారు. ఒకచోటికి చేరి సందడి చేస్తారు. ఫోటోలకి ఫోజులు ఇస్తారు. ఉయ్ ఆర్ వన్ చాటి చెబుతారు. ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే ఇప్పుడు మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా అల్లు అర్జున్ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన ఓ మూవీ ఈవెంట్‌లో…పవన్ అభిమానులు గోల గోల చేశారు. పవన్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ…బన్నీ ప్రసంగానికి అడ్డుతగిలారు. పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా వినకపోవడంతో కోపం నషాళానికెక్కింది. చిర్రెత్తుకొచ్చిన అల్లు అర్జున్…పవన్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ క్షణం నుంచి అల్లు అర్జున్‌ని…మెగా ఫ్యామిలీ వ్యక్తిగా వ్యక్తిగా చూడటం మానేశారు. ఈ వివాదం తర్వాత కూడా పవన్ కల్యాణ్, బన్నీలు ఎప్పటిలాగే కలిసిపోయారు. ఈ ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందంటూ..పుష్పరాజ్ బలుపు వ్యాఖ్యలు చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. అంతే అల్లు అర్జున్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా వదిలిపెట్టేశారు. అప్పటి నుంచి అవకాశం దొరికినపుడల్లా…బన్నీని చెడుగుడు ఆడుతున్నారు.
పుష్ప సినిమా హిట్టయ్యాక…అల్లు అర్జున్ ఒళ్లు బలిసి కొట్టుకున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకానొక దశలో బాయ్‌కాట్ పుష్పకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు…మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టాడు. భార్య స్నేహారెడ్డితో ఫ్రెండ్ శిల్పా రవికిశోర్ రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లాడు. జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు. పవన్ గెలిచిన తర్వాత విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు. మొత్తానికి మరోసారి అల్లు అర్జున్ వ్యాఖ్యలతో మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు.