జనతా గ్యారేజ్ (Janata Garage) కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కలిసి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా చేస్తున్న దేవర సినిమా పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 10న దేవర (Devara) రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దేవర థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 130 కోట్లకు పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారు ఏ సంస్థలు రేసులో ఉన్నాయి అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం మూడు బడా సంస్థలు.. దేవర రైట్స్ కోసం గట్టి పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది
దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ లాంటి బడా సంస్థలు దేవర కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఇక.. ఈ మూడు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతుండటంతో.. ‘దేవర’ రైట్స్ ఎవరి చేతులకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.
త్వరలోనే ఈ బిగ్ డీల్ క్లోజ్ కానుందని అంటున్నారు. ఇక ‘దేవర’ మూవీని నార్త్‌లో అనిల్ తడానితో కలిసి కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఓవర్సీస్ రైట్స్‌ను హంసిని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులు ఇంకో నెలలో క్లోజ్ కానుందట. మరి దేవర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.