TRIVIKRAM: ఘాటు లేని గుంటూరు కారం మరోసారి మహేష్ బాబు ఫ్యాన్స్‌ని నీరుగారి పోయేలా చేసింది. గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదటి రోజు నుంచి రకరకాల ఆటంకాలు ఎదుర్కొంటూనే వస్తుంది. షూటింగ్‌లో మూడుసార్లు మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ పద్ధతి నచ్చక బాయ్‌కాట్ చేసి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ సేవలో తరిస్తున్న త్రివిక్రమ్ ఒకపక్క ఆయనకి స్పీచ్‌లు రాసుకుంటూ, మరోపక్క డైరెక్షన్‌కి వస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి.
Guntur Kaaram Review: ఇలా చేసావేంటి రమణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!
ఇన్ని ఆటంకాలని ఎదుర్కొని థియేటర్ లోకి వచ్చిన గుంటూరు కారం.. పోనీ సూపర్ హిట్ అయిందా అంటే అది లేదు. నాలుగు సినిమాల్లో 4 సీన్లు కట్ చేసి అతుకుల బొంతలా చుట్టేశారంటూ ఫస్ట్ షో పడగానే పబ్లిక్ టాక్ వచ్చేసింది. నాలుగు కామెడీ సీన్లు, ఒక పాట కలిపి తీసిపడేశాడు అంటూ త్రివిక్రం శ్రీనివాస్‌ను ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. తానేదో మహా మేధావిలాగా లైఫ్ లెసన్స్ చెప్పే గురూజీ, మహేష్ బాబుని గుంటూరు కారంలో నిండా ముంచేశాడంటూ గోల చేస్తున్నారు. ఒక కథ లేదు, కథనం లేదు.. కుళ్ళు జోకులు.. డాన్సులు తప్ప ఏం చూసి సినిమాకి వెళ్ళాలి అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సంక్రాంతి పండక్కి వచ్చే సినిమా అంటే ఎలా ఉండాలి. జనానికి పిచ్చెక్కించాలి. థియేటర్లు బద్దలైపోవాలి. కానీ గుంటూరు కారం అవేమీ చేయలేకపోయింది. రూ.30 కోట్లు పెట్టి తీసిన హనుమాన్ సినిమాకి మంచి టాక్ వచ్చింది.
ఈ త్రివిక్రమ్‌కు ఏం పోయేకాలం మా సినిమాని ఇలా కంపు కంపు చేశాడు అంటూ తిట్టిపోస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కేవలం మాటలతో రెండున్నర గంటల సినిమాని నడిపిద్దాం అంటే ఎలా..? విషయం ఉండాలి కదా అని ఫీల్ అయిపోతున్నారు. ఒకప్పుడు అతడు.. ఆ తర్వాత ఖలేజా సినిమాలు కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి చివరికి టీవీ సినిమాలుగా మిగిలిపోయాయి. చివరికి గుంటూరు కారం బతుకు కూడా అలాగే అయిపోయింది అంటూ మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌ను ఇరగదీస్తున్నారు.