బెజవాడలో ఇల్లు కొన్న త్రివిక్రమ్, గృహ ప్రవేశం ఎప్పుడంటే… లోకేషన్ అక్కడే.

తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా వెళ్లకపోయినా... కొంతమంది నిర్మాతలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకునే ప్లానింగ్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 27, 2024 / 01:41 PM IST

తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా వెళ్లకపోయినా… కొంతమంది నిర్మాతలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకునే ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండే కొంతమంది డైరెక్టర్లు కూడా ఇప్పుడు అమరావతిలో లేదంటే విజయవాడ ఈ రెండు కాకపోతే గుంటూరులో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడియోల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏపీలో అడుగుపెట్టి ప్రభుత్వానికి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే హరీష్ శంకర్ విజయవాడలో లేదంటే అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కు పవన్ కు మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. త్రివిక్రమ్ ఏపీలో గనుక ఉంటే కచ్చితంగా అది ఏపీ ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయనకు నిర్మాతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో త్రివిక్రమ్ కొంతవరకు సక్సెస్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమే. అటు పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి త్రివిక్రమ్ అలాగే హరీష్ శంకర్ ఇద్దరు తమకు సొంత ఇల్లు ఉండాలని అది కూడా రాజధాని ప్రాంతంలో ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు.

విజయవాడలో ఉంటే ఎయిర్పోర్టు కూడా దగ్గరగా ఉంటుందని… దీనితో హైదరాబాద్ రావడం కూడా సుఖంగా ఉంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇప్పటికే విజయవాడలో కానూరు సమీపంలో ఒక ఇల్లు కూడా చూసాడు. అడ్వాన్స్ కూడా ఇప్పటికే ఇవ్వగా వచ్చే ఏడాది వేసవి తర్వాత గృహ ప్రవేశం చేయనున్నాడు. అయితే సినిమా వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా కొంతమంది మాత్రం ఏపీలో అడుగుపెట్టి తమ సినిమాల షూటింగ్ కూడా షురూ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి.

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రెండు సినిమాల షూటింగ్లను ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొత్తం విజయవాడ పరిసరాల్లోనే జరుగుతుంది. మంగళగిరి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయానికి అతి దగ్గరలో వేసిన ఒక సెట్లో ఈ సినిమా షూటింగ్లో కంప్లీట్ చేస్తున్నారు. అటు హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను విజయవాడ సమీపంలోనే మొదలుపెట్టే ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో కొంత షూటింగ్ చేయనున్నారు. అయితే సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా షూటింగ్ మాత్రం హైదరాబాద్ అలాగే మహారాష్ట్రలో జరగనుంది. మరి పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి ఇంకెంత మంది ఏపీలో అడుగు పెడతారో చూడాలి. ముందుగా వచ్చిన వాళ్లకు ఏపీ ప్రభుత్వం అవసరమైతే కొన్ని రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.