TRIVIKRAM: గురూజీ మీద ప్రభాస్, బన్నీ, చరణ్ ఫ్యాన్స్ ఫైర్..

ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరం అన్నాడు. అక్కడే మిగతా హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ రేంజ్ పెరిగింది. దేవర పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఈజీగా వెయ్యికోట్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 07:25 PM IST

TRIVIKRAM: మాటల మాంత్రికుడు మాటజారాడా..? ఏదో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ని బుట్టలో పడేద్దామని, పనికట్టుకుని పొగిడితే, అది మిస్ ఫైర్ అయ్యిందా..? ఇలాంటి డౌట్లు రావటానికి కారణం టిల్లూ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్‌లో ఆ సినిమాను పొగుడుతూనే, ఎన్టీఆర్ సినిమా దేవర వెయ్యికోట్ల మూవీగా సునామీ క్రియేట్ చేస్తుందన్నాడు త్రివిక్రమ్. అలా పొగడటం పెద్ద సమస్య కాదు. కాని ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరం అన్నాడు. అక్కడే మిగతా హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Traffic Diversions: రంజాన్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ రేంజ్ పెరిగింది. దేవర పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఈజీగా వెయ్యికోట్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే రేంజ్ స్టామినా, ఈ ఏడాది మరో నాలుగు మూవీలకు కూడా ఉంది. కాని అవన్నీ మర్చిపోయి ఈ ఏడాది దేవర నామ సంవత్సరం అనేశాడు త్రివిక్రమ్. అక్కడే చరణ్, ప్రభాస్, పవన్, బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయినట్టున్నారు. ఈ ఏడాది వెయ్యికోట్ల రేంజ్ దేవరకి మాత్రమే ఉందా? మరి ఆగస్ట్15 న వస్తున్న పుష్ప సీక్వెల్‌కి ఆరేంజ్ లేదంటారా..? త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్న బన్నీ, ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే, ఇలా పుష్ప 2ని గాలికొదిలేసి, దేవరని మాత్రమే త్రివిక్రమ్ పొగిడాడంటున్నారు. ఇక కల్కి రిలీజ్‌కి ముందే వేయ్యికోట్ల బిజినెస్ చేస్తోంది. అలాంటప్పుడు ఇది కల్కి నామ సంవత్సరం కాదా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో శంకర్ తీసిన గేమ్ ఛేంజర్‌కి వెయ్యికోట్ల సీన్ ఉంది. మరి ఇది గేమ్ ఛేంజర్ నామ సంవత్సరం కాదా..?

అంతెందుకు.. పవన్ నామ స్మరణ లేనిదే త్రివిక్రమ్‌కి ఇల్లు గడవదు. అలాంటి పవన్ ఓజీ కూడా వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టే పాన్ ఇండియా మూవీగా రాబోతోంది..? సాహో దర్శకుడు సుజీత్ దీన్ని ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశాడు కాబట్టి, లెక్కలు మారాయి. ఇలా చూస్తే పవన్, చరణ్, బన్నీ, ప్రభాస్ ఈ నలుగురి సినిమాలను వదిలేసి దేవరకి మాత్రమే వెయ్యికోట్ల స్టామినా ఉందనే మీనింగ్ వచ్చేలా త్రివిక్రమ్ టంగ్ స్లిప్ అయ్యాడు. అదే సోషల్ మీడియాలో పెను వివాదంగా కామెంట్ల వర్షానికి కారణమైంది.