TRIVIKRAM: గురూజీ, మాటల మాంత్రికుడు.. ఇవన్నీ త్రివిక్రమ్‌కు ఇండస్ట్రీలో ఉన్న ముద్దుపేర్లే. ఇప్పుడు ఆ బిరుదులకి శ్వేతనాగు అన్న టైటిల్ కూడా యాడ్ అవుతోంది. కారణం.. తన వల్ల చాలా మంది ఇబ్బంది పడటమే. పవన్ ఈ దర్శకుడిని గురువుగా భావించడంతోపాటు తన డేట్లు, తన కాల్ షీట్ల మీద కమాండ్ కూడా త్రివిక్రమ్‌కే అప్పజెప్పాడంటారు. ఆ చనువుతోనే చాలా మంది దర్శకులు, నిర్మాతలతో ఆడుకున్న తనకి గుంటూరు కారం మూవీతో ఫ్లాప్ పడింది.
PAWAN KALYAN: పవన్ పాట పాడితే.. పవర్ ఫుల్ కిక్కే..
అలాగే మహేశ్ ఫ్యాన్స్ నుంచి చీవాట్లు పెరగటంతో గురూజీ శత్రువులు పండగ చేసుకుంటున్నారట. పవన్‌తో ఉన్న చనువు కారణంగా బ్రో మూవీ కథలో కాలుపెట్టి ఆ ప్రాజెక్ట్ ముందు పూర్తయ్యేలా త్రివిక్రమే పని పూర్తి చేశాడంటారు. హరీష్ శంకర్‌తో పవన్ చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్‌కి బ్రేకులు పడటానికి, హరిహర వీరమల్లు ఏళ్లకేళ్లు సెట్స్‌కే పరిమితమవ్వటానికి కారణం కూడా త్రివిక్రమే అంటారు. పవన్ సినిమాలు అన్నీ ఆపి, తన అనుకున్న వాళ్ల మూవీలే పట్టాలెక్కేలా చేయటం త్రివిక్రమ్ పనితనం అన్న కామెంట్స్ ఉన్నాయి. భీమ్లానాయక్, బ్రో, ఓజీ ఇవన్నీ వేగంగా పట్టాలెక్కి రెండు పూర్తై మూడోది పూర్తి కావటానికి సిద్దంగా ఉంది. దీనికి కారణం గురూజీనే అంటారు. హరిహర వీరమల్లు ఎప్పుడో పూర్తి కావాలి.
కాని దాన్ని హోల్డ్ చేసి మిగతావన్నీ కానిచ్చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇది కామెంటే కాదు కంప్లైంట్ కూడా. అప్పట్లోనే గురూజీ విషపు నాగు అంటూ బండ్ల గణేష్ బాంబు పేల్చాడు. విచిత్రం ఏంటంటే ఈ విషపు నాగు గుణం గుంటూరు కారం ఫెయిల్యూర్‌తో బయట పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. తన శతృవులు ఇప్పుడు గురూజీకి పంచ్ పడటం చూసి పండగ చేసుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.