త్రివిక్రమ్ సంగతేంటి…? కథల్లేవా…? ఎవరూ వినట్లేదా…?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగ్ లు, ఆయన కొట్టిన సూపర్ హిట్ లు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 05:30 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగ్ లు, ఆయన కొట్టిన సూపర్ హిట్ లు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు. అసలు త్రివిక్రమ్ ఎందుకు డైరెక్ట్ గా సినిమాలు చేయడం లేదనే ఆవేదన ఆయన ఫ్యాన్స్ లో ఉంది. గురూజీ అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. కాని ఆయన మైక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదనే వార్తలు ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి.

అరవింద సమేత సినిమా తర్వాత… ఆయన చేసిన సినిమా గుంటూరు కారం. అసలు ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనపడలేదు. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక అక్కడితో త్రివిక్రమ్ పని అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు చేస్తున్నది పవన్ కళ్యాణ్ కు స్పీచ్ రాసి ఇవ్వడమే అనేది కొందరి మాట. పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. భీమ్ల నాయక్, వకీల్ సాబ్ వంటి సినిమాలకు త్రివిక్రమ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసారు.

ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఆయన బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. అలాగే… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథలో కూడా త్రివిక్రమ్ మార్పులు చేసారు అంటున్నాయి సినిమా వర్గాలు. అంతే గాని ఆయన మాత్రం అసలు స్టార్ హీరోలకు కథలు వినిపించడం గాని వేరే వాళ్ళ కథలు తీసుకుని సినిమాలు చేయడం గాని చేయడం లేదు. మహేష్ బాబు ఒత్తిడితోనే గుంటూరు కారం సినిమా చేసారు గాని ఆయనకు అంతగా ఆసక్తి లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల తిరుమలో త్రివిక్రమ్ కనిపించారు.

అక్కడి నుంచి ఆయనపై చర్చలు మొదలయ్యాయి. కొందరు త్రివిక్రమ్ శ్రీనివాస్… అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేసాడని ఆ కథ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాడని పుష్ప పార్ట్ 2 విడుదల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ సినిమా షూట్ ని మొదలుపెడతారని అంటున్నారు. అల్లు అర్జున్ కోసం సందీప్ రెడ్డి వంగా కథ రాసినా… స్పిరిట్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఇక త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో ఆయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ తిరిగి మొదలైంది. ఆ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.