Guntur Kaaram : ఓటీటీ లో రమణగాడి రచ్చ

డైరక్టర్ త్రివిక్రమ్(Trivikram), సూపర్‌స్టార్ (Super Star) మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం(Guntur Kaaram). ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ (OTT) డేట్ కూడా లాక్ చేసుకుంది.

కేవలం మహేష్ ఇమేజ్ (Mahesh Babu) తో కోట్లు రాబట్టిన ఈ మూవీ కేవలం నాలుగు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసుకుంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

రౌడీ రమణని 70ఎంఎంలో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడటానికి సిద్ధమవ్వండి. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని మేకర్స్ తెలిపారు.మరి ఓటీటీలో ‘గుంటూరు కారం’కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.