Trivikram Srinivas: క్లాస్ కాంబో.. నానితో త్రివిక్రమ్..

సంక్రాంతికి గుంటూరు కారం సినిమా అయిపోగానే రెండు నెలల గ్యాప్ తీసుకుని బన్నీతో సినిమా మొదలుపెట్టాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. అయితే ఆ సమయానికి అల్లు అర్జున్ కాస్త బిజీగా కనిపించే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 05:44 PM IST

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను త్వరగా పూర్తి చేయాలి అని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది. తప్పకుండా సినిమా సంక్రాంతి పోటీలో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో మరోసారి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది.

Rakibhai : రాకీ భాయ్ తో సాయి పల్లవి రొమాన్స్..

అయితే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అల్లు అర్జున్‌తో సినిమాను వెంటనే మొదలుపెట్టాలని కూడా అనుకున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా అయిపోగానే రెండు నెలల గ్యాప్ తీసుకుని బన్నీతో సినిమా మొదలుపెట్టాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. అయితే ఆ సమయానికి అల్లు అర్జున్ కాస్త బిజీగా కనిపించే అవకాశం ఉంది. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు కొంత ఆలస్యంగా కొనసాగుతూ ఉండటం వలన బన్నీ డేట్స్ దొరక్కపోవచ్చు అని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ సమయం వృథా చేయకుండా ఇప్పుడు మరొక హీరోతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో నితిన్‌తో కూడా అఆ.. అనే సినిమాను వేగంగా ఫినిష్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు త్రివిక్రమ్.

ఇప్పుడు అదే తరహాలో నేచురల్ స్టార్ నానిని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే నానికి మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎక్కువగా కొత్త దర్శకులతో, మీడియా రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ వస్తున్న నాని.. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేస్తే మాత్రం అతని మార్కెట్ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.