Trivikram: మాటల మాంత్రికుడి సాయం.. నితీష్‌ మాటకు త్రివిక్రమ్ ఓకే చెప్తారా..?

దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని టాక్ వినిపిస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది. కాగా.. ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగమయ్యరంటూ వినిపిస్తున్న వార్తలు సెన్సేషన్‌గా మారాయి.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 12:36 PM IST

Trivikram: రామాయణం’ ఎన్నిసార్లు విన్నా, చదివినా, చూసినా ఎప్పుడూ కొత్తగా కనిపించే ఇతిహాస గాథ. యుగాలు, కాలాలు, తరాలు మారినా ఆ కథ మాత్రం నిత్య నూతనం. వెండితెరపై ఎన్నోసార్లు అలరించిన రామాయణగాథ మరోసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

KALKI 2898 AD: స్ట్రాంగ్ వార్నింగ్.. కల్కి విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహం

దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని టాక్ వినిపిస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది. కాగా.. ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మన తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగమయ్యరంటూ వినిపిస్తున్న వార్తలు సెన్సేషన్‌గా మారాయి. నిజానికి నితీష్ తివారి తీసే రామాయణాన్ని తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయన కలానికి ఉన్న పదునేంటో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలతో పాటు, తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన రాసే ప్రతీ మాటకు అర్థాన్ని అచ్చుల్లో, భావాన్ని హల్లుల్లో రంగరించి రాస్తారు. అందుకే ‘రామాయణ’ చిత్ర బృందం ఈ అద్భుత దృశ్య కావ్యానికి అక్షరమాల అలరించే బాధ్యత త్రివిక్రమ్‌కు అప్పగించారని అంటున్నారు.

అయితే.. దర్శకుడిగా మారాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయభాస్కర్‌తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవకు మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి త్రివిక్రమ్.. నితీష్ కోరికను మన్నిస్తారా అనేది ఇప్పుడు డౌట్‌గా మారింది. కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒక వేళ అలా జరిగితే మాత్రం నితీష్ కోరుకున్నది జరగడం ఖాయం. ఒకవేళ త్రివిక్రమ్ నో చెప్తే మాత్రం నెక్స్ట్ ఆప్షన్‌గా సాయి మాధవ్ బుర్రా పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.