Jayaprada: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు షాక్ ఇచ్చింది యూపీ కోర్టు. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కేసులో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈకేసుకు సంబంధించి నవంబర్ 17న తన ముందు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. ఆమెపై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది.
Naga Chaitanya, : మేక్ఓవర్ కోసం అష్టకష్టాలు పడుతున్న చైతు.. న్యూ లుక్ వర్క్ అవుట్ అవుతుందా.. ?
జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ నవంబర్ 8న ఆమె కోర్టుకు హాజరుకాలేదని ప్రాసిక్యూషన్ అధికారి అమర్‌నాథ్ తివారీ నవంబర్ 9న తెలిపారు. దీంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగించింది. తదుపరి విచారణ కోసం నవంబర్ 17న కేసును పోస్ట్ చేసింది. కాగా 2019 ఎన్నికల ప్రచారంలో జయప్రదపై స్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది ప్రస్తుతం రాంపూర్ ఎంపీ-,ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది.
జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక రహదారిని ప్రారంభించారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. దీంతో ఆమె ఇబ్బందుల్లో పడ్డారు. ఈ కేసుకు గతంలో తమిళనాడులోని ఒక సినిమా థియేటర్‌కు సంబంధించి కార్మికుల ఈఎస్‌ఐ చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారనే కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.