రెబల్ స్టార్ గన్ కి రెండు బ్యారెల్లు… ప్రభాస్ కోసం పాక్ నుంచి…

ప్రభాస్ తో హను రాఘవపూడీ తీయబోతున్న సినిమా ఫౌజీ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలు కాబోతోంది. ఆల్రెడీ లాంచైన ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ ఇస్మైల్ అని మాత్రమే తేలింది. కాని ఇందులో రెండో హీరోయిన్ కూడా ఉంది. తనే సాజల్ ఆలీ... తనో పాకీస్థానీ...

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 01:04 PM IST

ప్రభాస్ తో హను రాఘవపూడీ తీయబోతున్న సినిమా ఫౌజీ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలు కాబోతోంది. ఆల్రెడీ లాంచైన ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ ఇస్మైల్ అని మాత్రమే తేలింది. కాని ఇందులో రెండో హీరోయిన్ కూడా ఉంది. తనే సాజల్ ఆలీ… తనో పాకీస్థానీ…

మొన్నటి వరకు తనే లీడింగ్ లేడీ అని ప్రచారం జరిగింది. తీరా ఫౌజీ లాంచ్ అయ్యేటైంకి కొత్త అమ్మాయి ఇమాన్వీ ఇస్మాయిల్ కనిపించగానే, వచ్చినవన్నీ పుకార్లనుకున్నారు. కానేకాదు, ఇమాన్వీ ఇస్మాయిల్ ఫౌజీలో హీరోయినే అయినా, మరో హీరోయిన్ గా సాజల్ ఆలీ కనిపించబోతోందని తేలింది

ఇక అతిలోక సుందరి శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన హిందీ మూవీ మామ్ లో కూతురి పాత్ర వేసిన పాకిస్థాని నటి సాజల్ ఆలి, 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ మూవీలో నటించబోతోంది. అంతా బానే ఉంది. ఈ సాజల్ ఆలి కాని, ఇమాన్వీ ఇస్మాయిల్ కాని పెద్ద వెల్ నోన్ ఫేసులు కాదు. రాజా సాబ్ లోనటిస్తున్న మాలవికా మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్లు కాదు. అంతెందుకు సలార్ శ్రుతి హాసన్ కూడా ఔట్ డేట్ అయ్యే స్టేజ్ లోనే ప్రభాస్ పుణ్యమాని బంపర్ ఆఫర్ కొట్టేసింది.

రెబల్ స్టార్ రేంజ్ కి కల్కీలో దీపికా పదుకొనేని తీసుకున్నట్టు, ఆరేంజ్ లేడీనే తనకి జోడీగా తీసుకోవాలి.. కాని అలా తీసుకోకపోవటానికి కారణం, ప్రభాస్ మూవీల్లో హీరోయిన్లకి తక్కువ నిడివి ఉన్న పాత్రలు దొరకటమే… ఎక్కువ నిడివీ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ వస్తే, దీపికా పదుకొనే, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లను తీసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు, రెబల్ స్టార్ ఇమేజ్ కి కొత్తగా హీరోయిన్ల గ్లామర్ అద్దాల్సిన అవసరం లేదు. ఎవరున్నా లేకున్నా ఆ కటౌట్ కి కాస్త కంటెంట్ పడితే, బొమ్మ బ్లాక్ బస్టరే… అలా కూడా హీరో ఇమేజ్ అమాంతం పెరగటంతో హీరోయిన్ల ప్రయారిటీ కూడా తగ్గిపోతోందనుకోవచ్చు..

ఏదేమైనా ఫౌజీలో హీరోయిన్ గా ఇమాన్వీ ఇస్మాయిల్ ని ఫైనల్ చేసేందుకు ప్రభాస్ కాని, డైరెక్టర్ హను రాఘవపూడీ కాని 15 రోజులే టైం తీసుకున్నారట. పాన్ ఇండియా కింగ్ సరసన క్వీన్ అంటే ఎలా ఉండాలనే అంచనాలను తారుమారు చేస్తూ, ఇంత వేగంగా ఓ ఇన్ స్టార్ ఇన్ ఫ్లూయెన్సర్ ని హీరోయిన్ గా తీసుకోవటానికి రీజన్, పాత్రకు ఖచ్చితంగా కొత్త ముఖమే కావాల్సిరావటం… ఏదేమైనా స్టార్ మీరోయిన్లతో కాల్ షీట్స్ సమస్య తోపాటు, అతి సమస్యలు పెరుగుతాయని కూడా నిర్మాతలు వాళ్లకి దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే పెద్దహీరోయిన్లు ఎగబడుతున్నా, వాల్ల అతి కోర్కెలు తీర్చటం ఇబ్బందని దర్శక నిర్మాతలు కూడా, కొత్త ముఖాలకే ప్రయారిటీ ఇస్తున్నారట.