అక్కినేని అఖిల్, జైనాబ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఈ మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టి… పర్సనల్ లైఫ్ పై అఖిల్ ఫోకస్ చేయడం చూసి కొందరు షాక్ అయినా… ఈ మ్యారేజ్ మాత్రం కాస్త ట్రెండ్ సెట్టర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అఖిల్ హిందువు కాగా జైనాబ్ ముస్లిం కావడంతో వీరి వివాహం ఎలా చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాతో పాటుగా నేషనల్, స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా దీనిపై ఫోకస్ చేసాయి.
ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం… వీరి వివాహం రెండు సంప్రాదాయాల ప్రకారం చేసే ఆలోచనలో ఉన్నారట పెద్దలు. ఇద్దరి మతాలను గౌరవిస్తూ పెద్దలు ఈ వివాహం చేసేందుకు రెడీ అయ్యారు. జైనాబ్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. నిర్మాణ రంగంలో ఆయన దిగ్గజం. ఇక నాగార్జున కూడా సినిమాల సంగతి పక్కన పెడితే వ్యాపార రంగంలో కూడా దిగ్గజంగానే ఉన్నారు. దీనితో ఈ వివాహం విషయంలో కాస్త స్పెషల్ గా ఆలోచిస్తున్నారని టాక్. జైనాబ్ ఫ్యామిలీకి మిడిల్ ఈస్ట్ లో వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి.
దుబాయ్ రాజులతో కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందుకే అప్పట్లో ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ ఆయన్ను… మిడిల్ ఈస్ట్ కు సలహాదారుగా ప్రకటించారు. కేబినేట్ హోదా కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి వివాహం అనంటే కచ్చితంగా విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ వివాహాన్ని రెండు సంప్రాదాయాల ప్రకారం చేయడానికి రెడీ అవుతున్నారట. ఒకటి ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఫలక్ నుమా ప్యాలెస్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసే అవకాశం ఉంది.
అలాగే అన్నపూర్ణా స్టూడియోస్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా రెండు మత సంప్రాదాయాలను గౌరవిస్తూ ఈ వివాహాన్ని జరపనున్నారు. నిశ్చితార్ధం కూడా అలాగే రెండు సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు అని సమాచారం. ఇక త్వరలోనే పెళ్లి తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇలా అక్కినేని అఖిల్ వివాహం ట్రెండ్ సెట్టర్ కానుంది. త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య వివాహం కూడా జరగనుంది. ఈ వివాహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో అతికొద్ది మంది సన్నిహితులతో నిర్వహిస్తున్నారు. కేవలం 300 మంది మాత్రమె ఈ వివాహానికి హాజరు కానున్నారట.