దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎక్కడ హర్ట్ అయ్యాడో తెలియదు గాని ఇప్పుడు కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని పని చేస్తున్నాడనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. సినిమాల విషయంలో రాజకీయాలు చేయడం తన సినిమాను అన్ని విధాలుగా కావాలని టార్గెట్ చేయడం ఎన్టీఆర్ కు ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఇప్పుడు తెలుగు మార్కెట్ కంటే ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్లాన్ తోనే దిగుతున్నాడు ఎన్టీఆర్. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.
ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ నటులతో పాటుగా బాలీవుడ్ నటులను కూడా దగ్గర చేసుకోవడానికి ప్లాన్ రెడీ చేస్తున్నాడు. వాస్తవానికి దేవర విషయంలో ఎన్టీఆర్ కు ఇతర భాషల నుంచి చాలా మంచి సహకారం అందిన మాట వాస్తవం. దేవరను కన్నడ అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. అక్కడ బ్లాక్ మార్కెట్ లో దేవర టికెట్ 3 వేలు కూడా పలికింది అంటే సినిమాను ఏ రేంజ్ లో అక్కడి జనాలు ఆదరించారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా రెండు వారాలు గడిచిన తర్వాత కూడా భారీగా వసూళ్లు వచ్చాయి.
హిందీ సినిమాలకు మించి దేవర పెత్తనం హిందీ లో కొనసాగడం చూసి అక్కడి పండితులు కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్, కన్నడ సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తున్నాడు. తన సినిమాలో శివ రాజ్ కుమార్ ను కీలక పాత్రలో తీసుకోవాలని విలన్ గా కూడా బాలీవుడ్ నటుడ్ని లేదా కన్నడ నటుడ్ని తీసుకోవాలని చెప్పాడని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు విలన్ లు ఉంటారని టాక్. ఇద్దరూ కూడా బాలీవుడ్ విలన్లే అని సమాచారం.
బాలీవుడ్ లో ఇప్పుడు విలన్ గా బిజీ అవుతున్న బాబీ డియోల్ తో పాటుగా జాన్ అబ్రహం ను కూడా ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలని తారక్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా వర్క్ చేస్తున్నాడు. కేజిఎఫ్ సినిమాలో విలన్ల విషయంలో ప్రశాంత్ మార్క్ కనపడింది. ఇప్పుడు అదే ఫార్ములాను అవసరమైతే ఎన్టీఆర్ సినిమాకు కూడా అమలు చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ గా కూడా కన్నడ అమ్మాయిని సెలెక్ట్ చేసారని టాక్. రుక్మిణీ వసంత ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నారు.