ఓన్లీ విజయ్ కనకమేడల మాత్రమే కాదు.. నాంది సినిమాకు పని చేసిన చాలా మంది టీం ఉగ్రం సినిమాకు కూడా పని చేశారు. ఓవర్‌సీస్‌లో కూడా ఉగ్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్‌గా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంది. సినిమా ప్రారంభంలో లవ్ ట్రాక్ పెద్దగా పండలేదు. దాదాపు 30 నిమిషాల వరకూ కథ చాలా బోరింగ్‌గా ఉంటుంది. కానీ ఆ తరువాత కథ కాస్త ట్రాక్ ఎక్కుతుంది.
ఇంటర్వెల్‌కు ముందు మొదలయ్యే థ్రిల్లర్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను చైర్స్‌కు కట్టి పడేశాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెల్లింది. హీరోయిన్ క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకు అన్నిటికంట పెద్ద అస్సెట్.. అల్లరి నరేష్ యాక్టింగ్. క్యారెక్టర్‌లో జీవించేశాడు. మాస్ లుక్‌లో అదరగొట్టాడు. గతంలో ఎప్పుడూ చూడని నరేష్‌ను ఈ సినిమాలో చూశామంటున్నారు ఆడియన్స్. నరేష్‌లో కామెడీ యాంగిల్ కంటే ఈ యాంగిల్ చాలా బాగుందంటున్నారు.
యాక్టింగ్ మాత్రమే కాదు సినిమాలో డాన్స్ కూడా ఇరగదీశాడు నరేష్. సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా థ్రిల్లర్ సీన్స్‌లో వచ్చే మ్యూజిక్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. థ్రిల్లింగ్‌లో మరింత ఇంటెన్సిటీని పెంచింది. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరన్ పాకాలకు వంద మార్కులు పడ్డాయి. మొత్తంగా నాంది టీం.. మరోసారి కలిసి ఉగ్రం సినిమాతో నాందిని మించిన బెస్ట్ టాక్‌తో దూసుకుపోతున్నారు.