మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీకి కమిటైనప్పుడు, దేవర ఇంకా రిలీజ్ కాలేదు. జనాల్లో రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ ఎలా ఫేస్ చేస్తాడనే డౌటుండేది.. కట్ చేస్తే దేవర వసూళ్ల వరదకి, రాజమౌళి సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ చేయటం హ్రితిక్ రోషన్ ఫేటే మార్చే అద్రుష్టంగా లెవల్ పెరిగింది. అలా సూపర్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్, ఇప్పుడు తన కెరీర్ లోనే టచ్ చేయని పాత్ర వేయబోతున్నాడు. మాస్ రూట్లో తనెన్ని ప్రయోగాలైనా చేసి ఉండొచ్చు.. లేదంటే క్లాస్ రూట్లో ప్రయోగాలు చేయాలని అనుకోవచ్చు.. కాని మాస్ రూట్లోనే తను టచ్ చేయని పాత్రలో జెండా పాతే ఛాన్స్ దొరికింది. టచ్ చేస్తే వందలు కాదు వెయ్యికోట్ల పండగ కన్ఫామ్.. కొన్ని సినిమాలు కథ స్టేజ్ లో పాత్రల వల్ల పవర్ ఫుల్ రిజల్ట్ గ్యారెంటీ అని తేల్చేస్తాయి…అలాంటి డ్రాగన్ గా మారుతున్నాడు తారక్. ఇప్పటి వరకు కేవలం టైటిలే రివీలైంది…ఇప్పుడు డ్రాగన్ గా తారక్ ఏం చేయబోతున్నాడో తేలింది..
ఎన్టీఆర్ దేవరగా సౌత్, నార్త్, తోపాటుఅమెరికన మార్కెట్ ని కూడా షేక్ చేశాడు. ఇప్పుడు కూల్ గా ముంబై వెల్లి వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. క్లైమాక్స్ ఫైట్ సీన్ తోపాటు సాంగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేసే పనిలోఉంది ఫిల్మ్ టీం. ఆతర్వాత అంటే జనవరి 26 తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ గా ఉండబోతున్నాడు. జనవరి 26 లోగా వార్ 2 షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆతర్వాతే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ షూటింగ్ షురూ కాబోతోంది
కేజీయఫ్, కేజీయఫ్ 2 ఇలా రెండీంట్లో రాఖీ భాయ్ లాండి పవర్ ఫుల్ డార్క్ రోల్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, తర్వాత సలార్ లో రెబల్ స్టార్ ని అంతకుమించిన పవర్ ఫుల్ పాత్రలో చూపించాడు. ఇప్పుడు ఏకంగా డ్రాగన్ అంటూ నిప్పులు కక్కే రాక్షసబల్లి లాంటి పాత్ర పేరుని పెట్టారు. అంటే అదేరేంజ్ లో ఉంటుందో అన్న అంచనాలైతే పెరుగుతున్నాయి
అయితే డ్రాగన్ మూవీ లో ఎన్టీఆర్ పాత్రకు ప్రేరణ ఏంటో తేలింది. తన తల్లిని తనకు దూరం చేసిన ఓ డాన్ పని పడ్డే డ్రాగన్ గా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతోందట. నిజానికి ఈ పాత్ర కు ప్రేరణ కూడా కేజీయఫ్ పార్ట్ 1 అనే తెలుస్తోంది.
కేజీయఫ్ లో తాగుబోతు తండ్రి వల్ల కష్డపడే తల్లి, తను చనిపోతూ కొడుకుని గట్టెక్కించే తల్లి పాత్ర కదిలిస్తుంది. అలాంటి తల్లిని కాపాడుకునే వ్యక్తిగా, తన తల్లి తాలూకు కష్టాలకు రివేంజ్ తీసుకునే కొడుకుగా ఎన్టీఆర్ పాత్ర కనిపిస్తుందట.
ఇలాంటి ఓ ప్రచారం మొదలు కాగానే, ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు. అంటే కేజీయఫ్ కి డ్రాగన్ కి లింకుందా? సలార్ కథని కూడా ఈ మూవీకి లింక్ చేస్తారా? ఇలాంటి డౌట్లు పెరిగాయి. ఐతే ఎన్టీఆర్ కి ఫైనల్ స్టోరీ నెరేట్ చేసిన ప్రశాంత్ నీల్, తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేయిట్ చేస్తున్నాడట. ఒక్కసారి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక ఇది కేజీయఫ్, సలార్ ని కలిపితే వచ్చే ఔట్ పుట్ లా ఉండటం ఖాయం. తల్లి కోసం తండ్రిని వేటాడే కొడుకుగా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్
డ్రాగన్ పాత్రకి పురాణాల్లో భక్త ప్రహల్లాదుడి పాత్రే ప్రేరణ అని తెలుస్తోంది. ఇక డ్రాగన్ లో హీరో పాత్ర ప్రహల్లాద్ గా పెట్టడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ లీక్ అయ్యే ఛాన్స్ లేదు. కాని బయటికి పొక్కడానికి ఒకే ఒక్క రీజన్. ప్రహల్లాద్ పేరుని డ్రాగన్ టీం రిజిస్టర్ చేయటం బట్టి చూస్తుంటే, భవిష్యత్తులో ఎవరు ఈ పేరుని వాడకుండా, టైటిల్ మార్చాల్సి వస్తే మార్చే వెసులు బాటు ఉండాలని రిజిస్టర్ చేశారు. అలా డ్రాగన్ లో హీరో పాత్ర బయటికి పొక్కుతోంది.