ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉన్న ఉసాసన మదర్స్ డే సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోను షేర్ చేసింది. తాను గర్భవతి అయ్యాక వచ్చిన మొదటి మదర్స్‌డే కావడంతో మదర్‌హుడ్‌లో ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పింది. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లి జరిగి పదేళ్లు గడిచింది. ఇంత లేట్‌గా పిల్లల్ని కనడానికి కారణాన్ని మరోసారి గుర్తు చేశారు ఉపాసన.
పెళ్లి జరిగిందనో లేక తల్లిదండ్రులు కావాలనో పిల్లల్ని కనడంపై తనకు నమ్మకం లేదని చెప్పింది ఉపాసన. ఎమోషనల్‌గా తాను ఎప్పుడు తన బిడ్డకు పరిపూర్ణమైన ప్రేమ ఇవ్వగల్గుతానో ఆప్పుడే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నట్టు ఉపాసన చెప్పారు. ఆ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా పక్కన పెట్టి కెరియర్‌లో ముందుకు సాగానని చెప్పింది.
ఈ విషయంలో ఉపాసనకు రామ్ చరణ్ ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారట. ప్రతీ విషయాన్ని అర్థం చేసుకుని ధీమాగా ఉన్నాడట. ఇప్పుడు తాను అన్ని విధాలా బిడ్డకు జన్మినిచ్చేందుకు సిద్ధం అవ్వడంతో ఇప్పుడు తల్లిని అవుతున్నానని చెప్పారు ఉపాసన. రామ్ చరణ్ కూడా ఉపాసనను అన్ని విధాలా కేర్ చేస్తున్నాడు.
తాను ఎక్కడికి షూట్‌కు వెళ్లిన భార్యను తీసుకువెళ్తున్నాడు. విహారయాత్రలు చేస్తూ భార్యతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక ఉపాసన డెలివెరీ టైంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెండు నెలల పాటు భార్యతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట రామ్ చరణ్. ఏది ఏమైనా పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన రామ్ చరణ్ తీసుకుంటున్న కేర్ చూస్తుంటే చాలా అడోరబుల్‌గా ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.