Upasana Kamineni: ఉపాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా, అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజసేవ కూడా చేస్తోంది. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. తనవంతు కృషి చేస్తోంది. కాగా.. గతేడాది జూన్ 20వ తారీఖున రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బేబీకి ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టారు.
Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్
అయితే రెండో బిడ్డకు జన్మనివ్వడానికి తాను సిద్ధం అంటూ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడలు. రామ్ చరణ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ చేయబోతున్నాడు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు ఈ స్టార్ హీరో. ఇక మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఒక పక్క అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోపక్క సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇవేకాక ఎన్నో స్వచ్ఛందసేవా సంస్థల ద్వారా తనవంతు సమాజసేవ చేస్తోంది. తాజాగా మహిళల ఆరోగ్యానికి సంబంధించి ‘ఎండో మార్చ్’ ప్రొగ్రామ్‌లో మెగా కోడలు ఉపాసన పాల్గొంది. ఈ ఈవెంట్‌లో మహిళా సాధికారత గురించి ఆమె పలు విషయాలు వెల్లడించారు.
స్త్రీకి ఏది కావాలో అది సాధించుకునే హక్కు ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. పిల్లలు లేట్ గా కనాలనే తాను ఇన్ని రోజులు ఆగానని, అయితే తాను ప్రస్తుతం రెండో బిడ్డను కనడానికి సిద్దంగా ఉన్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు త్వరలోనే తమ్ముడో లేదా చెల్లెలో వస్తుంది అన్నమాట అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.