UPASANA KONIDELA: క్లింకారాకు ఇద్దరు చెల్లెళ్లు.. ఫొటో షేర్ చేసిన ఉపాసన

ఇప్పుడు క్లీంకారా చెల్లెలి ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. అదేంటి క్లింకారకు చెల్లెళ్లు లేరుగా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా. వాళ్లే వీళ్లు అన్నమాట. ఉపాసన చెల్లి అనుష్పాల ట్విన్స్‌కు జన్మనిచ్చింది.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 08:36 PM IST

UPASANA KONIDELA: మెగా కోడలు ఉపాసన.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. పార్టీలు, ఫంక్షన్స్, గ్రాండ్ పేరెంట్స్‌ను కలవడం.. రాంచరణ్ ఫొటోస్, క్లింకార అప్డేట్స్.. ఇలా ప్రతిదీ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్లీంకారా చెల్లెలి ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. అదేంటి క్లింకారకు చెల్లెళ్లు లేరుగా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా.

PAWAN KALYAN: 100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్న పవర్ స్టార్..?

వాళ్లే వీళ్లు అన్నమాట. ఉపాసన చెల్లి అనుష్పాల ట్విన్స్‌కు జన్మనిచ్చింది. ఆ పిల్లల బారసాల ఫంక్షన్‌కు రాంచరణ్, క్లింకారాతో కలిసి అటెండ్ అయింది ఉపాసన. ఆ కవల పిల్లలతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేరింది. ఉపాసన చెల్లెలు అనుష్పాల.. డిసెంబర్ 2021లో అర్మాన్ ఇబ్రహీంను పెళ్లిచేసుకుంది. ఈ మధ్యే కవలపిల్లలకు జన్మనిచ్చింది. వారి నామకరణం ఫంక్షన్‌లో మిస్టర్ సి ఫ్యామిలీ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన షేర్ చేసింది. అద్భుతమైన, అందమైన ముగ్గురు సిస్టర్స్‌ను పరిచయం చేస్తున్నాం.. క్లింకార తన చెల్లెళ్లు అయిన ఐరా పుష్పా ఇబ్రహీం, రికా సుచరిత ఇబ్రహీంతో చేరిపోయింది అంటూ రాసుకొచ్చింది.

ఇక ఈ ఫొటోలో.. క్లింకారను చరణ్ ఎత్తుకోగా.. ఐరా పుష్పా ఇబ్రహీం, రికా సుచరిత ఇబ్రహీంలను వారి పేరెంట్స్ ఎత్తుకొని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ పిక్ అని కొందరు.. క్లింకారకు తోడు దొరికింది.. ఆడుకోవడానికి అని కొందరు చెప్పుకొస్తున్నారు.