టాలీవుడ్ (Tollywood) లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ కపుల్ లిస్టులో రామ్‌చరణ్-ఉపాసన (Ramcharan-Upasana) ముందుంటారు. వీళ్లిద్దరి అండర్ స్టాండింగ్ ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుందని ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉంటారు. ఇక మెగా కోడలి (Mega Kodalu) గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా ఉపాసన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే.. పెళ్లైన పదేళ్ల వరకు చెర్రీ-ఊప్స్ జంటకు పిల్లలు కలగలేదు.. ఈ కారణంగా యాంటీ ఫ్యాన్స్ నుంచి ఈ జంట చాలా విమర్శలు ట్రోల్స్ ఎదుర్కొన్నారు. కావాలనే వద్దు అనుకున్నారు అని చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ రామ్ చరణ్, ఉపాసనాలపై నెగిటివ్ ప్రచారాలు ఆగలేదు.
దీంతో.. మెగాఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందారు. వీటన్నికి చెక్ పెడుతూ 2022 డిసెంబర్ లో చిరంజీవి తన కోడలు ఉపాసన గర్భం దాల్చిన విషయం అభిమానులతో పంచుకున్నాడు. 2023 జూన్ 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ లిటిల్ ప్రిన్సెస్‌కు క్లిన్ కార అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది మెగా ఫ్యామిలీ.. అయితే.. ఇప్పుడు ఉపాసన గర్భానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
పదేళ్ల తర్వాత పిల్లలు కనడం వెనుక కారణం ఉపాసన రెండు మూడు సందర్భాల్లో కారణాలు చెప్పింది. పెళ్ళైనప్పుడే పదేళ్ల వరకు పిల్లలు వద్దని చరణ్ నేను అనుకున్నామని… అందుకే ఎంతటి ఒత్తిడి ఎదురైనా పిల్లల్ని కనలేదంది.
పిల్లల్ని పెంచడం అన్నది ఒక పెద్ద బాధ్యత. అన్ని విధాలా సిద్ధం అయ్యాకే తల్లిదండ్రులు కావాలనుకున్నామని క్లారిటీ ఇచ్చింది. అయితే.. పిల్లల్ని కనే విషయంలో ఇటీవల ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ.. వెంటనే పిల్లలు వద్దు అనుకున్న మహిళలు తమ ఎగ్స్ భద్రపరుచుకోవచ్చు, ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చని.. వాటిని తల్లి కావాలని కోరుకున్నప్పుడు వాడుకోవచ్చని తెలిపింది.. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం అనుకున్నప్పుడు దాచుకున్న అండాల ద్వారా తల్లి కావచ్చు’ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పలు ఊహాగానాలను తెర తీసాయి. ఉపాసన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీశాయి. ఉపాసన సహజంగా తల్లి కాలేదు.
గతంలో దాచుకున్న ఎగ్స్ ఫెర్టైల్ చేయడం ద్వారా గర్భం దాల్చానని పరోక్షంగా చెప్పిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దాచుకున్న ఎగ్స్ ఫెర్టిలైజర్ చేయడం ద్వారా ఆమె గర్భం దాల్చారా’ అంటూ రచ్చ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. అయితే మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్స్‌ను కొట్టి పడేస్తున్నారు. ఉపాసన మెగా వారసురాలని ‘క్లింకార’ కు జన్మనివ్వడం ఎంతో ఆనందకరం అంటున్నారు. అంతేకాకుండా.. ఉపాసన ఇప్పుడు రెండో బిడ్డను కూడా కనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మెగా ఇంట అడుగుపెట్టబోయే మరో బుజ్జాయి కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.