Ramcharan : గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై అప్‌డేట్

మెగా పవర్‌ స్టార్‌ (Mega Power Star) రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్‌ మూవీ 'గేమ్‌ ఛేంజర్' (Game Changer) .. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

 

 

 

మెగా పవర్‌ స్టార్‌ (Mega Power Star) రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్’ (Game Changer) .. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. రామ్ చరణ్‌ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టి దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. కానీ ఇంతవరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగించింది లేదు, ఆ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించింది లేదు. దీంతో.. మూవీ రిలీజ్ డేట్‌పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే.. మెగా ఫ్యాన్స్ టెన్షన్‌కు తెరదించుతూ ఓ లేటెస్ట్ బజ్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

చాలా కాలంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమా ఒకనొక టైంలో 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అంతేకాదు ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపు లేఖలు కూడా రాశారు. డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ ఇండియాన్ 2 కూడా తెరకెక్కిస్తుండటంతో పాటు.. కొన్నిటెక్నీకల్ కారణాల వల్ల గేమ్ చేంజర్ మూవీ షూటింగ్‌ లేట్ అవుతూ వచ్చింది. దీంతో పాటు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ కూడా రాలేదు. దీంతో.. గేమ్ ఛేంజర్ నుంచి గత ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజుకి వదిలిన చరణ్ లుక్ తప్ప ఇంతవరకు అఫీషియల్ అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్.. అలా చూస్తుండగానే.. మళ్ళీ రామ్ చరణ్ బర్త్ డే కూడా వచ్చేసింది.

చెర్రీ బర్త్‌డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ అంటే ఫస్ట్ సింగిల్ వదులుతున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సరికొత్త షెడ్యూల్ కి సిద్ధం అయ్యింది.. ఈ టైమ్‌లోనే చెర్రీ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ మే నెల నాటికి పూర్తయిపోతుంది అని టాక్ వినిపిస్తోంఇ.. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ లో శంకర్ నిమగ్నమవుతారని, అందుకే రామ్ చరణ్ కూడా బుచ్చి బాబు దర్శకత్వంలో RC16 మొదలు పెట్టేశారని అంటున్నారు. ఏప్రిల్ నుంచి RC16 రెగ్యులర్ షూట్ లో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది. ఇక గేమ్ ఛేంజర్ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం. దసరాకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా వస్తుండటంతో గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయినట్లు సమాచారం.. మొత్తానికి డిసెంబర్‌కి అయినా గేమ్ చేంజర్‌ రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ తో చెర్రీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.