Urvashi Rautela: కేక పుట్టించిన ఊర్వశి రౌతెలా.. బర్త్ డే కేక్ ధర రూ.3 కోట్లు

బర్త్ డేకి ఏకంగా గోల్డెన్ కేక్‌ను కట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బ్యూటీ బర్త్ డే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాములుగా కేక్‌ ధరలు ఎంతుంటాయ్‌ మహా అంటే రూ.లక్ష అనుకోవచ్చు. కానీ ఒక కేకు ధర అక్షరాల మూడు కోట్ల రూపాయలపైనే.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 04:08 PM IST

Urvashi Rautela: కొంత మంది సెలబ్రిటీలు ఏ పని చేసినా.. కాస్త డిఫరెంట్‌గా ఉండాలని భావిస్తారు. అందులో భాగంగానే వాళ్లు వేసుకునే డ్రస్సుల దగ్గర నుంచి ఆఖరికి తొడిగే చెప్పుల వరకు కూడా వెరైటీని కోరుకుంటారు. ఇక మరికొందరు మాత్రం రిచ్ గా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక తాజాగా తన రిచ్ నెస్ ను ప్రపంచానికి చూపించింది ఓ స్టార్ హీరోయిన్. తన బర్త్ డేకి ఏకంగా గోల్డెన్ కేక్‌ను కట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Nayanthara: వంద కోట్లు ఇస్తా వస్తావా.. దొబ్బేయ్ రా.. నయన డోంట్ కేర్ ఆన్సర్

ఆ బ్యూటీ బర్త్ డే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాములుగా కేక్‌ ధరలు ఎంతుంటాయ్‌ మహా అంటే రూ.లక్ష అనుకోవచ్చు. కానీ ఒక కేకు ధర అక్షరాల మూడు కోట్ల రూపాయలపైనే. అంతలా కేక్‌ ప్రత్యేకంగా తయారుచేశారు. ఆ కేక్‌ను అందాల తారకు ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఆ బ్యూటీ ఎవరో కాదు అందాల తార ఊర్వశీ రౌటెలా. ఈ బ్యూటీ ఈ పేరు చెప్పగానే కాస్త వెరైటీనే గుర్తుకు వస్తుంది. డ్రస్సింగ్‌లో గానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్‌లో గానీ, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారంలో ఈ అమ్మడు చేసే ఇన్ డైరెక్ట్ ట్విట్స్‌తో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఫిబ్రవరి 25న తన 30వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్ డే తన జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంది. ఏకంగా గోల్డెన్ కేక్‌ను కట్ చేసి.. అందరికి షాకిచ్చింది.

ఏకంగా 24 క్యారెట్ల బంగారపు పూతతో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ బర్త్ డే వేడుకల్లో యోయో హనీ సింగర్ మెరిశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఆ పిక్స్‌పై నెటిజన్ల పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత డబ్బులు ఉంటే మాత్రం కేక్‌కు గోల్డెన్ లేయర్ పూయడం అవసరమా ఆ డబ్బులు పెట్టి పేద పిల్లలకు సాయం చేయెుచ్చు కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఎప్పటికీ ఇలానే స్పెషల్‌గా ఉండు హ్యాపీ బర్త్ డే అంటూ మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.