ఎంత మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తే మాత్రం మరీ ఇంత ఔట్ డేటెడ్ కథలో చేయాలా అంటున్నారు. మూడు సినిమాలు చేయలేదు అంతలోనే మాస్ ఇమేజ్ కావాల్సి వచ్చిందా? ఉప్పెన హిట్ తప్ప మరో హిట్ లేని వైష్ణవ్ కలిసొచ్చే ప్రయోగాలను వదిలి, ఈ రొటీన్ రొట్ట కొట్టుడుకి సై అనటం సిల్లీగా ఉందంటున్నారు.
అఖిల్ ని ఇలాచే చేస్తే ఏమైంది, ఏజెంట్ వరకు పంచ్ పడింది. ఏదో మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ వెళ్లినంతకాలం ఈ అక్కినేని బ్యాచ్ కి కలిసొచ్చింది. మాస్ జపం చేస్తే పంచ్ పడింది. నితిన్ కి అదే జరిగింది. నాని దసరా తప్పా మిగతా అన్ని సందర్భాల్లో ఇదే నిజమైంది.
శర్వానంద్ కూడా ఇలా దెబ్బ తినే రూట్ మార్చాడు.. అయినా మాస్ ఇమేజ్ మాయలో పడి, కలిసొచ్చే ఫ్యామిలీ డ్రామాలో మిగతా జోనర్లు వదిలి, పాత చింకాయ పచ్చడి లాంటి మూడు ఫైట్లు ఆరు పాటలతో మాస్ మూవీ ప్లాన్ చేయటం వల్లే ట్రోలింగ్ పెరిగింది. అసలే టీజరే చెత్తగా ఉందనే కామెంట్ల దాడి పెరిగింది.